భారత్‌కు చెందిన ప్రముఖ మసాలా ఉత్పత్తుల కంపెనీ ‘ఎవరెస్ట్’కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల ఈ కంపెనీ ఉత్పత్తులను సింగపూర్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కంపెనీపై హాంకాంగ్ కూడా బ్యాన్ విధించింది. ఎవరెస్ట్‌తో పాటు భారత్‌కు చెందిన మరో కంపెనీ ఎండీహెచ్ మసాలా ఉత్పత్తులపై కూడా నిషేధం విధిస్తున్నట్టు హాంకాంగ్ ఆహార భద్రత నియంత్రణ సంస్థ (సీఎఫ్‌ఎస్) వెల్లడించింది. తమ దేశ పౌరులెవ్వరూ ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయరాదంటూ నిషేదాజ్ఞలు జారీ చేసింది. ఈ రెండు కంపెనీల మసాలాల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: భారత్‌కు చెందిన ప్రముఖ మసాలా ఉత్పత్తుల కంపెనీ ‘ఎవరెస్ట్’కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల ఈ కంపెనీ ఉత్పత్తులను సింగపూర్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కంపెనీపై హాంకాంగ్ కూడా బ్యాన్ విధించింది. ఎవరెస్ట్‌తో పాటు భారత్‌కు చెందిన మరో కంపెనీ ఎండీహెచ్ మసాలా ఉత్పత్తులపై కూడా నిషేధం విధిస్తున్నట్టు హాంకాంగ్ ఆహార భద్రత నియంత్రణ సంస్థ (సీఎఫ్‌ఎస్) వెల్లడించింది. తమ దేశ పౌరులెవ్వరూ ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయరాదంటూ నిషేదాజ్ఞలు జారీ చేసింది. ఈ రెండు కంపెనీల మసాలాల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే పురుగు మందు మోతాదుకు మించి ఉన్నట్టు పేర్కొంది. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని కలిగించే ఈ రసాయనం ఉన్నందున హాంకాంగ్, సింగపూర్ దేశాలు ఎవరెస్ట్, ఎండీహెచ్ కంపెనీల మసాలా ఉత్పత్తులను విక్రయించడాన్ని నిషేధించాయి.
ఏప్రిల్ 19న ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు సింగపూర్ గుర్తించి, నిషేధించింది. ఇందులో వినియోగించిన ఇథిలీన్ ఆక్సైడ్ అనే రసాయనం మండే స్వభావం కలిగినది. దీనిని ఆహార ఉత్పత్తుల్లో వినియోగించకూడదు. దీనిని ప్రధానంగా వ్యవసాయ, ధూమపానం, క్రిమిసంహారకం వంటి ఉత్పత్తుల్లో మత్రమే వినియోగిస్తారు. ఆహారాన్ని బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల నుంచి రక్షించడానికి పరిమితమోతాదులో దీనిని వినియోగిస్తారు. ఒకవేళ మోతాదుకు మించితే రొమ్ము క్యాన్సర్‌తో పాటు నాడీమండల వ్యవస్థ, మెదడు, డీఎన్‌ఏపై తీవ్ర దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇది జరగడానికి ముందు ఏప్రిల్ 5 భారత్‌కు చెందిన ఎమ్‌డీహెచ్ మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు హాంగ్‌కాంగ్ గుర్తించింది. ఎమ్‌హెచ్‌ఆర్డీకి చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, మిక్స్‌డ్ మసాలా పౌడర్, సాంభార్ మసాలాలు, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో ఈ రసాయనం ఉన్నట్లు పేర్కొంది.
విదేశాల్లో నిషేధానికి గురైన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై భారత్‌లో కూడా విక్రయిస్తుండటంతో ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అప్రమత్తమైంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ కంపెనీలకు చెందిన నాలుగు మసాలా ఉత్పత్తులకు సంబంధించిన శాంపిల్స్ (నమూనాలు) సేకరించి పరీక్షిస్తున్నట్టు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. 2023లో ఎవరెస్ట్ సాంబార్ మసాలా, గరం మసాలా ఉత్పత్తులను తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన ఎవరెస్ట్ తమ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాల గురించి పెదవి విప్పలేదు. ఈ కంపెనీకి చెందిన మొత్తం 60 రకాల ఉత్పత్తుల్లో ఒక ఫిష్ కర్రీ మసాలాను మాత్రమే పక్కన పెడుతున్నట్లు పేర్కొంది.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం