చదువును మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడిగా అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలను మ్యాట్రిమోనీ వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు వచ్చిన డబ్బుతో దుబాయ్, మలేషియా, సింగపూర్, బ్యాంకాక్ వెళ్లి జల్సాలకు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన ఓ వితంతువు నుంచి ఏకంగా 1.8 కోట్ల రూపాయలను కొట్టేసి ఆమెను బురిడీ కొట్టించాడు. విషయం తెలుసుకున్న సదరు మహిళ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో అతగాడి అసలు రూపం బయటపడింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తిరుపతి జిల్లా పాకాల మండలం వలపలవారిపల్లికి చెందిన వంశీ చౌదరి అలియాస్ కృష్ణ వంశీ అలియాస్ కన్నయ్య బెంగళూరులో గ్లాస్ కట్టింగ్ పనిచేసేవాడు. పక్కనే ఉన్న జాబ్ కన్సల్టెన్సీ వారితో పరిచయం పెంచుకుని తేలిగ్గా డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టాడు. ఉద్యోగాల ఆశజూపి కొందరు నిరుద్యోగుల్ని మోసం చేయడంతోఅక్కడి వారు పోలీస్ స్టేష్టన్‌లో కేసు నమోదు చేశారు. షాదీ డాట్కామ్‌లో వంశీకృష్ణ పేరుతో రిజిస్టర్ చేసుకుని తాను విడాకులు తీసుకున్నానని అమెరికాలో గూగుల్ కంపెనీలో పనిచేస్తున్నట్లు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు.
అయితే ఒంటరిగా ఉన్న మహిళలతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. ఆ తరువాత మహిళల బ్యాంకు ఖాతా వివరాలు, బంగార ఆభరణాలు కొట్టేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. తనకు కస్టమ్స్ అధికారులతో పరిచయాలు ఉన్నాయని, ఏయిర్‌పోర్టులో సీజ్ చేసిన బంగారాన్ని తక్కువ ధరకు కొందామని నమ్మబలికాడు. ఇలా హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు అమ్మాయిలను బుట్టలో వేసుకున్నాడు. వివాహం చేసుకుంటానని, వారి తల్లిదండ్రులను నమ్మించాడు. తెలివిగా బ్యాంకు ఖాతా వివరాలు సంపాదించి డబ్బులు అవసరమని అసలు మోసానికి తెరలేపాడు. ఈ రకంగా మొత్తం 1.8 కోట్ల రూపాయలు వసూలు చేసి పత్తా లేకుండాపోయాడు వంశీ. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు వంశీని అరెస్టు చేశారు. అతని నుంచి రెండు సెల్ ఫోన్లు, కస్టమ్స్ అధికారుల పేరుతో ఉన్న నకిలీ రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం