లుథియానా: చాక్లెట్లు తిని ఏడాదిన్నర చిన్నారి రక్త వాంతులు చేసుకుంది. ఈ ఘటన పంజాబ్‌లోని లుథియానాలో జరిగింది. పాటియాలలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో చిన్నారికి గిఫ్ట్ ప్యాక్‌లో స్నాక్స్, చాక్లెట్లు బహుమతిగా ఇచ్చారు.
ఈ చాక్లెట్లు తిన్న చిన్నారి రక్త వాంతులు చేసుకుందని చిన్నారి దగ్గరి బంధువు ఒకరు తెలిపారు. అయితే ఆ చాక్లెట్లు ఎక్స్పైరీ చాక్లెట్లని తేలాయి. వాంతులు చేసుకున్న వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
చిన్నారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. షాపు వాళ్లే గడువు తీరిపోయిన ఎక్స్పైరీ చాక్లెట్లు అమ్ముతున్నారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో షాపు నుంచి ఎక్స్పైరీ చాక్లెట్లు, స్నాక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్చ్ నెలలోనే పాటియాలలో బర్త్‌డే కేక్ తిన్న ఒక చిన్నారి ఫుడ్ పాయిజన్ అయి మృతి చెందిన విషయం తెలిసిందే
Also read
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య
- భార్యను చంపి బోరు బావిలోపాతిపెట్టి.. పార్టీ ఇచ్చాడు!
- చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య
- విజయవాడలో భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత
- నరక యాతన పడి వ్యాన్ డ్రైవర్ మృతి