సెల్ఫోన్ కోసం తలెత్తిన ఘర్షణలో ఓ కుమారుడు కన్నతండ్రినే హత్య చేసిన వైనమిది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
రామకృష్ణాపూర్ : సెల్ఫోన్ కోసం తలెత్తిన ఘర్షణలో ఓ కుమారుడు కన్నతండ్రినే హత్య చేసిన వైనమిది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ లో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామకృష్ణాపూర్లోని అల్లూరి సీతారామరాజు నగర్ కు చెందిన బావండ్లపెల్లి రాయమల్లు (60) సింగరేణి విశ్రాంత కార్మికుడు. అతడి రెండో భార్య కుమారుడు రాకేష్ (25) లారీ క్లీనర్గా పని చేస్తున్నాడు. కొన్ని రోజులుగా తండ్రి సెల్ఫోన్ను రాకేష్ ఉపయోగిస్తున్నాడు. గురువారం రాత్రి సెల్ఫోన్ తిరిగి ఇచ్చేయాలని రాకేష్ను తండ్రి అడగడంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. రాకేష్ ఆవేశంలో రోకలితో తండ్రి తలపై కొట్టాడు. రాయమల్లుకు తీవ్ర రక్తస్రావం కాగా.. అంబులెన్సులో మంచిర్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. ఘటనా స్థలానికి మందమర్రి సీఐ శశిధర్రెడ్డి, ఎస్సై రాజశేఖర్ వెళ్లి వివరాలు ఆరా తీశారు. రాకేష్ను అదుపులోకి తీసుకున్నారు. క్యాతనపల్లి వద్ద రైల్వే గేటును సుమారు 20 నిమిషాల సేపు తీయకపోవడంతో వైద్యం అందడం ఆలస్యమై రాయమల్లు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025