సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడు తన కిరణ స్పర్శతో దేవదేవుడిని అభిషేకించిన అద్భుత సన్నివేశం
రాజగోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తున్న భానుడి కిరణాలు
సింహాచలం, : సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడు తన కిరణ స్పర్శతో దేవదేవుడిని అభిషేకించిన అద్భుత సన్నివేశం మంగళవారం సాయంత్రం భక్తులను ఆధ్యాత్మిక పరవశానికి గురి చేసింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాస్తమయం సమయంలో సూర్య కిరణాలు అప్పన్న స్వామిని తాకాయి. ఏటా ఉగాది రోజున జరిగే ఈ అపురూప దృశ్యాన్ని కనులారా దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భానుడు పడమర కనుమల్లోకి వాలుతుండగా ఆలయ రాజగోపురం నుంచి అరుణ కిరణాలు అప్పన్న స్వామిని చేరుకున్నాయి. భక్తులు గోవింద నామస్మరణతో ఈ దృశ్యాన్ని తిలకించి పరవశులయ్యారు. కొన్నేళ్లుగా వాతావరణం అనుకూలించక కిరణ స్పర్శను దర్శించుకునే భాగ్యం భక్తులకు కలగలేదు. ఈసారి ఎలాంటి అవాంతరాలు లేకపోవడంతో అద్భుత దృశ్యం సాకారమైంది. ఈవో సింగల శ్రీనివాసమూర్తి, వైదికుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025