మహబూబాబాద్ : బస్సు ఆపడం లేదని ప్రయాణికులు సదరు బస్సుపై దాడికి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి తొర్రూరు బస్టాండ్‌లో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనం ప్రకారం.. తొర్రూరు నుంచి జగద్గిరిగుట్టకు వెళ్లే తొర్రూరు డిపో బస్సు ప్రయాణికులతో కిక్కిరిసింది. బస్సు ఎక్కేందుకు బయట ఉన్న ప్రయాణికులు యత్నించగా డ్రైవర్ ఆపకుండా వెళ్లేందుకు ప్రయత్నించాడు.
ఆగ్రహించిన ప్రయాణికులు బస్సు అద్దాలపై రాళ్లతో దాడి చేశారు. డ్రైవర్, కండక్టర్ బస్సును నిలిపి డయల్–100కు కాల్ చేయగా పోలీసులు చేరుకుని గొడవను సద్దుమణిగేందుకు చర్యలు తీసుకున్నారు. పలువురు ప్రయాణికులకు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్ష నిర్వహించి మద్యం తాగిన వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!