పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతినగర్ లో జరిగింది.
నిజాంపేట: పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతినగర్లో జరిగింది. ఎస్ఆర్ నగర్లోని దాసారం బస్తీకి చెందిన తేజస్ (21) అలియాస్ సిద్ధూ.. గత ఏడాది స్థానికంగా జరిగిన ఓ హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో | జైలుకు వెళ్లి రెండు నెలల క్రితం విడుదలయ్యాడు.

ప్రస్తుతం ప్రగతినగర్లోని అద్దె ఇంట్లో తన తల్లితో కలిసి నివాసముంటున్నాడు. ఆదివారం రాత్రి సిద్ధూ తల్లి ఊరు వెళ్లింది. దీంతో ఒంటరిగా ఉన్న తేజస్.. తన మిత్రులైన మహేశ్, శివప్ప, సమీర్ తో కలిసి మద్యం తాగాడు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రగతినగర్లోని బతుకమ్మ ఘాట్ ఎదురుగా నిలబడి ఉండగా.. గతంలో హత్యకు గురైన తరుణ్ స్నేహితులు సుమారు 20 మంది ద్విచక్రవాహనాలపై వచ్చి తేజస్ను కత్తులతో పొడిచి చంపారు.
హత్య తర్వాత నిందితులు సెల్ఫీ వీడియో ద్వారా చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. తరుణ్ హత్యకు ప్రతీకారంగా తమ పగ నెరవేర్చుకున్నామంటూ నిందితులు ఆ పోస్టులో పేర్కొనడం గమనార్హం. ఘటనాస్థలిని కూకట్పల్లి ఏసీపీ కె.శ్రీనివాసరావు, బాచుపల్లి సీఐ జె ఉపేందర్యాదవ్ పరిశీలించారు. ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





