ఉగాది 2024 తెలుగు పంచాంగం ప్రకారం, ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఉగాది పండుగ ప్రారంభం కానుంది. ఈ సమయంలో కొన్ని శుభ యోగాల కారణంగా ద్వాదశ రాశులలో 5 రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి
ఉగాది 2024 హిందూ క్యాలెండర్ ప్రకారం, ఉగాది పండుగను నూతన సంవత్సరంగా భావిస్తారు. ‘క్రోధి’ నామ సంవత్సరం వేళ శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదే రోజు నుంచి ఛైత్ర నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా.. జ్యోతిష్యం ప్రకారం, కొత్త ఏడాదిలో అంగారకుడు(కుజుడు) రాజుగా ఉంటే.. మంత్రిగా శని ఉంటాడని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఉగాది పండుగ వేళ సర్వార్ధ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, ప్రీతి యోగం కూడా ఏర్పడనున్నాయి. ఇవి ఉదయం 7:30 గంటలకు ప్రారంభమై రోజంతా ఉంటాయి. ఈ శుభ యోగాల కారణంగా కొన్ని రాశుల వారికి ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. అంతేకాదు ఏడాది పొడవునా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించనుంది. ఈ సందర్భంగా ఉగాది నుంచి ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మేష రాశి(Aries)..
ఉగాది తర్వాత చంద్రుడు మేష రాశిలోకి సంచారం చేయనున్నాడు. గురువుతో స్నేహం కారణంగా గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో ఉద్యోగులకు ప్రమోషన్, కెరీర్ పురోగతికి అవకాశాలు పెరుగుతాయి. మీ తెలివితేటలతో మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్య పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటక రాశి(Cancer)..
ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో చంద్రుడి ప్రభావంతో లాభదాయకమైన ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంది. శని దేవుని అనుగ్రహంతో మీరు అన్ని రంగాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులకు, వ్యాపారులకు మెరుగైన ఫలితాలొస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది

సింహ రాశి(Leo)..
ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. మీకు చాలా రంగాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం లభిస్తుంది. విదేశాలలో విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలొస్తాయి. సంతానం పొందాలనుకునే వారికి ఆనందంగా ఉంటుంది

ధనస్సు రాశి(Sagittarius)..
ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశాలున్నాయి. విద్యార్థులు ఉన్నత విద్యలో మంచి విజయాలు సాధిస్తారు. సంతానం పొందాలనుకునే వారికి ఈ ఏడాది కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ, కడుపు సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఈ ఏడాది మీరు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలున్నాయి

కుంభ రాశి(Aquarius)..
ఈ ఏడాది చివర్లో శని దేవుడు కుంభ రాశి నుంచి నిష్క్రమించి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కుంభ రాశి వారికి శని దేవుని ప్రభావంతో చాలా విషయాల్లో శుభప్రదంగా ఉంటుంది. మీరు చాలా చురుగ్గా ఉంటారు. ఆర్థిక పరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. మీరు పెట్టే పెట్టుబడుల్లో మంచి ఫలితాలను పొందుతారు. అవివాహితులకు వివాహం పట్ల ఆసక్తి ఉంటే ఈ కాలం అనుకూలంగా ఉంటుంది.