హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సర్వీస్ రివాల్వర్‌తో కాల్పుకుని ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్ ఆత్మహత్యకు చేసుకున్నాడు. కాగా, బాలేశ్వర్ నాగర్ కర్నూల్‌కు చెందిన వ్యక్తి అని తెలిసింది.
వివరాల ప్రకారం.. అచ్చంపేట్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ టీఎస్‌ఎస్‌పీ రిజర్వ్ ఎస్‌ఐగా కబూతర్ ఖానాలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆదివారం ఉదయం తన సర్వీర్ రివాల్వర్‌తో తనను తానే కాల్చుకుని బాలేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఈ సందర్భంగా డీసీపీ సాయి చైతన్య మాట్లాడుతూ.. బాలేశ్వర్ మృతిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. బాలేశ్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చూరీకి తరలించాము. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామన్నారు.
Also read
- Lord Shani: ఈ ఏడాది శనీశ్వర జయంతి ఎప్పుడు? పూజా విధానం, చేయాల్సిన దానాలు ఏమిటంటే..
- Astro Tips for Neem: శని లేదా రాహు-కేతువు దోషాలతో ఇబ్బంది పడుతున్నారా.. ఇంటి ఆవరణలో ఈ మొక్కని పెంచండి..
- నేటి జాతకములు…16 మే, 2025
- HYD BREAKING: పోలీస్ దెబ్బలకు వ్యక్తి మృతి?
- TG Crime: సూర్యాపేట జిల్లాలో విషాదం.. మూడు సబ్జెక్టుల్లో ఫెయిలైన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Kiran Royal Issue: జనసేన నేత కిరణ్ రాయల్ కేసులో బిగ్ ట్విస్ట్.. లక్ష్మి అరెస్ట్