కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. ఏ ప్రాణి అయిన తమ సంతానాన్ని ప్రాణం కన్నా మిన్నగా చేసుకుంటాయి. అయితే ఓ కసాయి తండ్రి కూతురు నల్లగా పుట్టిందన్న కోపంతో ఏకంగా గొంతు నులిమి చంపేశాడు. తండ్రి చేతిలో కను మూసిన ఆ బాలిక మరణం ఇప్పుడు వివాదాస్పదంగా మారటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిజనిజాలు తేల్చే పనిలో పడ్డారు. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన యువకుడికి మూడేళ్ల క్రితం బొమ్మరాజుపల్లికి చెందిన యువతితో వివాహమైంది. మొదటి ఏడాది వీరికి సంతానం కలగలేదు. దీంతో పిల్లులు పుట్టాలంటూ పూజలు చేశారు. చివరికి ఏడాదిన్నర క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది ఆ తల్లి. అప్పటి నుండి ఆ తల్లి కూతురిని అల్లారుముద్దుగా పెంచుకుంటుంది.
అయితే పద్దెనిమిది నెలల చిన్నారి నల్లగా ఉండటం ఆ తండ్రికి నచ్చలేదు. దీంతో ఆ చిన్నారిపై కక్ష పెంచుకున్నాడు. చిన్న వయస్సులోనే చిదిమి వేయాలనుకున్నాడు. ఒకసారి అతని ప్లాన్ ఫెయిల్ అయింది. అయినా పట్టు విడవలేదు. రెండో ప్రయత్నంలో తాను అనుకున్నది సాధించాడు. గొంతు నులిమి చంపేశాడు. అంతకముందు నీళ్ల డ్రమ్ములో ముంచి చంపే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ తల్లే అడ్డుకుంది. అయితే ఆ తర్వాత రాత్రి సమయంలో చిన్నారి గొంతు నులిమే సరికి ముక్కు వెంట రక్తం కారింది. అనుమానం వచ్చిన వెంటనే చిన్నారి తీసుకొని తల్లి ఆసుపత్రికి పరుగెత్తింది. అయితే అప్పటికే ఆ చిన్నారి చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. దీంతో ఆ తల్లి భర్తను నిలదీసింది. అతనే చంపినట్లు నిర్ఱారణకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే అంత్యక్రియలు ముగియడంతో పోస్ట్ మార్టం చేసేందుకు పోలీసులు, వైద్యులు సిద్దమయ్యారు. అయితే చిన్నారి నల్లగా ఉందన్న కారణంతోనే చంపినట్లు అందరూ అనుకుంటున్నారు.
Also read
- Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత.. 12 రాశుల వారికి వారఫలాలు
- Andhra Pradesh: ఇలా ఉన్నారేంట్రా.. గోల్డ్ షాపు ఓనర్ కళ్లలో కారం కొట్టి ఇతడు ఏం చేశాడో చూడండి..
- Ugadi 2026: పరాభవ నామ సంవత్సరం అర్థం ఏమిటి..? మనకు ఇచ్చే రహస్య సందేశం ఏంటో తెలుసా..?
- టార్గెట్ ఒకరు.. ప్రాణం పోయింది మరొకరిది.. బట్టల తీగకు కరెంట్ షాక్ పెట్టి హత్య
- దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?





