గంజాయి అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతుంది. గంజాయిపై పోలీసులు ఉక్కు పాదం మోపినా, తరచు ఏదో ఒక ప్రదేశంలో మాదకద్రవ్యాలు పట్టుపడుతూనే ఉన్నాయి. పోలీసులు వాటిని ఎంత కట్టడి చేయాలి అనుకున్న హైదరాబాద్ మహానగరంలో ఏదో ఒక మూలన గంజాయి లభ్యమవుతునే ఉంది. పట్టపగలు అర్ధరాత్రిలను తేడా లేకుండా విపరీతంగా గంజాయి విక్రయాలు చేస్తున్నారు గాంజా ముఠా సభ్యులు. స్టూడెంట్ నుంచి మొదలుకుంటే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వరకు ఏ ఒక్కరిని వదలకుండా గంజాయికి బానిసలుగా మారుస్తున్నారు. మీ జేబులో డబ్బులు ఉండాలి అంతే నిరంతరం ఏదో ఒక ప్రదేశంలో గంజాయి దొరుకుతుంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్న గంజాయి ముఠాలు
తాజాగా హైదరాబాద్ మహానగరం శివారు మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్స్‌ను విక్రయిస్తున్న నిందితుడిని అరెస్టు చేశారు రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు. మొయినాబాద్ పరిధిలోని తోలుకట్ట గ్రామ శివారులో ఒక షెడ్డులో అక్రమంగా దాచిన గంజాయితోపాటు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. బీహార్ కు చెందిన సౌరబ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి యువకుడు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వలస వచ్చి గంజాయి విక్రయాలను మొదలుపెట్టాడు. అతనికి తోడుగా పాత నేరస్తుడైన అలీ ఖాన్ తో తోడయ్యాడు. ఇద్దరు కలిసి గంజాయి అక్రమ దందాకు తెర లేపారు. పక్కా సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు తోలుకట్ట గ్రామ శివారులోని షెడ్‌లో తనిఖీలు చేపట్టారు. దీంతో గంజాయి గుట్టురట్టైంది.
గతంలో ఫోన్ల దొంగతనానికి పాల్పడిన నిందితుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 580 గ్రాముల గంజాయి 92 గంజాయి చాక్లెట్లను రూ. 4,500 నగదును ఐదు మొబైల్ ఫోన్లతో పాటుగా దొంగతనం చేసిన రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు పోలీసులు.
ఇలా ఉండగా పాతబస్తీలోని ఉప్పుగుడాలో భారీగా గంజాయి ని పట్టుకున్నారు శంషాబాద్ ఎస్‌వోటి పోలీసులు. ఐదు లక్షల విలువ చేసే 14 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఈ కేసులో ఇద్దరు మహిళలను అరెస్టు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన వారి వద్ద నుండి గంజాయితోపాటు ఒక కారు రెండు మోటార్ సైకిళ్ళు, రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. గంజాయి చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేసి విద్యార్థులకు విక్రయిస్తున్నారు మహిళలు. ఈ కేసులో శిరీష పద్మతోపాటు శ్రీనివాస్ చారి అనే వ్యక్తిపై ఎన్‌డీపీఎస్ ఆర్‌టీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం