హైదరాబాద్: మాట్లాడే పని ఉందని చెప్పి హోటల్‌కు పిలిచి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఫుడ్ డెలివరీ బాయ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మల్లేపల్లికి చెందిన ఒబేదుల్లాఖాన్ (23) ఫుడ్ డెలివరీ బాయ్. ఎనిమిది నెలల క్రితం లక్డీకాపూల్‌లో ఓ సెమినార్‌కు హాజరైన ప్రైవేటు ఉద్యోగిని (22) ఫుడ్ ఆర్డర్ చేయడంతో ఒబేదుల్లా ఆమెకు అందజేశాడు. ఆమె డబ్బులను గూగుల్ పే చేయడంతో ఆ నంబర్ తీసుకున్న ఒబేదుల్లా ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు.
కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉండే సదరు యువతి ఒబేదుల్లాకు సన్నిహితమైంది. ఇదే అదనుగా భావించినన ఒబేదుల్లా గురువారం రాత్రి మాట్లాడే పని ఉందని ఆమెను తన బైక్‌పై తీసుకుని బంజారాహిల్స్‌లోని ఓయో రూమ్‌కు వచ్చాడు. రాత్రి ఒంటి గంట తర్వాత ఆమె నిద్ర మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ 376, 354, 354 (ఏ), డి, 376, 66 (ఇ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు
Also read
- పరారీలో అఘోరి, శ్రీ వర్షిణి.. ఫోన్లు స్విచ్చాఫ్- ఆ భయంతోనే జంప్!
- విహారయాత్రలో విషాదం – విద్యార్ధి మృతి
- Wife Murder: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!
- Telangana: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !
- Khammam Crime: ఖమ్మంలో కసాయి కోడలు.. మామ కంట్లో కారం చల్లి.. ఏం చేసిందంటే!