November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: విశాఖలో ఆయిల్ పైరేట్ల కలకలం.. సముద్రంలో ఉండగానే మాయం చేస్తున్నారు..

విశాఖ, కాకినాడ తీరాల్లోని షిప్‌యార్డ్‌లనుంచి ఆయిల్‌ చోరీ అవుతోంది. సముద్రంలో ఉండగానే గ్యాలన్లకొద్దీ ఆయిల్‌ మాయమైపోతోంది. షిప్పింగ్ బోట్లకు తక్కువ ధరకు అమ్మకాలు జరుపుతున్న ఆయిల్‌ పైరేట్ల ముఠా గుట్టు రట్టయింది. విశాఖపట్నంలో ఆయిల్ మాఫియా ఆట కట్టించారు పోలీసులు. నౌకల నుంచి మోటార్‌ బోట్ల ద్వారా సముద్ర మార్గంలో ఆయిల్ ను తీరానికి తెచ్చి అమ్ముతున్నట్టు గుర్తించారు పోలీసులు. ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా ఈ ఆయిల్ దందా సాగిపోతోంది. ఫిషింగ్ బోట్ల కోసం ఈ డీజిల్ ఆయిల్ ను వినియోగిస్తున్నారు. కాకినాడ, మచిలీపట్నంలో నుంచి వచ్చే నౌకల నుంచి ఆయిల్ ను మోటర్ బోట్లలో ఫిల్ చేసి తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. డీజిల్ ఆయిల్ స్మగ్లింగ్ వెనుక పెద్ద ముఠాయే పనిచేస్తుందన్నారు డీసీపీ సత్తిబాబు.

ఆయిల్‌ పైరేట్స్‌లో మొత్తం ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీర్రాజు అలియాస్ స్వామి, బడే రాజు, సూరడ రాములను కటాకటాల వెనక్కు నెట్టారు. అయిదు వందల లీటర్ల డీజిల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

పరారిలో ఉన్న మరో పది మంది కోసం గాలింపు జరుపుతున్నామని, మొత్తం కూపీ లాగుతున్నామన్నారు డీసీపీ సత్తిబాబు.

సముద్రంలో ఉండగానే ఆయిల్‌ మాయం చేస్తున్న ఆయిల్‌ పైరేట్లతో విశాఖ, కాకినాడ, మచిలీపట్నం షిప్‌యార్డుల్లో కలకలం రేగింది

Also read

Related posts

Share via