తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వైపు గామన్ వంతెనపై ఆదివారం సాయంత్రం ప్రకంపనల్లో వ్యత్యాసం రావడంతో టోల్ ప్లాజా నిర్వాహకులు అప్రమత్తమయ్యారు.
కొవ్వూరు పట్టణం, చాగల్లు, : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వైపు గామన్ వంతెనపై ఆదివారం సాయంత్రం ప్రకంపనల్లో వ్యత్యాసం రావడంతో టోల్ ప్లాజా నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. కొవ్వూరు- రాజమహేంద్రవరం మధ్య గోదావరిపై ఉన్న ఈ వంతెన 52వ స్తంభం వద్ద యాక్షన్ జాయింట్ బేరింగ్లో సమస్య తలెత్తిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో టోల్ ప్లాజా మేనేజర్ రాజీవ్యాదవ్, సిబ్బంది ఆ ప్రదేశాన్ని పరిశీలించి ఒకవైపు ట్రాఫిక్ నిలిపివేశారు. పట్టణ సీఐ వి. జగదీశ్వరరావు మేనేజర్తో మాట్లాడి ఉన్నతాధికారులు, నిపుణులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ట్రాఫిక్ మళ్లింపుతో వాహన చోదకులు అవస్థలు పడ్డారు. ఈ విషయమై ఆర్అండ్ బీ ఆర్డీసీ డివిజన్ ఈఈ శ్రీకాంతన్ ‘మీడియా ‘ సంప్రదించగా వంతెనకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. సోమవారం ప్రత్యేక నిపుణులు రానున్నారని, బేరింగ్లో సమస్య ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలించి చర్యలు చేపడతామని చెప్పారు.
Also read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!





