పోలీసై వుండి క్రిమినల్ పనులా..! ఫోన్ ట్యాపింగ్ కేసులో అలాంటి భయో డేటా బయటపడుతోంది. ఈ కేసుపై వైడ్ యాంగిల్ ఉచ్చు బిగించేస్తోంది స్పెషల్ టీమ్. SIB అడ్డాగా ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీత్ రావు రోల్ ఏంటి? ప్రమోషన్ వెనుక సీక్రెట్ ఏంటీ? ఎవరి ఆదేశాలతో మిషన్ ట్యాపింగ్? ఏ కుట్రతో డేటా ధ్వంసం? విచారణలో డొంక కదులుతోంది. పొలిటికల్ లింకులపై మరింత ఫోకస్ పెట్టారు పోలీసులు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సంచలనాలు క్యూ కడుతున్నాయి. S.I.B స్పెషల్ ఇంటెలీజెన్స్ బ్రాంచ్ అడ్డాగా మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అండ్ టీమ్ నిర్వాకాల డొంకలు కదులుతున్నాయి. రెండు రూములు..17 కంప్యూటర్లతో స్పెషల్ సెటప్ వెనుక అసలు కథ బయటపడుతోంది. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే కొత్త మాల్వేర్ ద్వారా ప్రణీత్ రావు అండ్ టీమ్ ప్రైవేటు వ్యక్తుల ఫోన్ కాల్స్‌ను ట్యాపింగ్ చేసినట్టు విచారణలో తేలింది. కాల్ రికార్డ్స్‌ను హార్డ్‌డిస్కల్లో ప్లస్ పెన్ డ్రైవ్‌లో సేవ్ చేశారు. ఎస్‌ఐబీ కంప్యూటర్లలో కొన్ని సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసిన ప్రణీత్.. ఎన్నికలు రోజు ఆ సాఫ్ట్‌వేర్లను డిలీట్ చేసినట్టు ఎంక్వయిరీలో తేలింది.
అనధికారికంగా కొన్ని సాఫ్ట్‌వేర్లను ఇతర దేశాల నుండి కొనుగోలు చేసినట్టు గుర్తించారు పోలీసులు. ఎస్ఐబీకి చెందిన పలు హార్డ్ డిస్క్ లను సైతం కట్టర్లతో కత్తిరించి, వాటిని అడవిలో పడేసినట్లు ప్రణీత్ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ప్రణీత్ రావును వికారాబాద్ అడవిలోకి తీసుకెళ్లి హార్డ్ డిస్క్ శకలాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
తనకున్న పలుకుబడితో ప్రమోషన్లు ఇప్పిస్తానంటూ ఎరవేసి మెరికల్లాంటి ఉద్యోగులతో టీమ్‌ను ఏర్పాటు చేసుకున్న ప్రణీత్‌రావు.. వేల ఫోన్‌కాల్స్‌ను ట్యాప్ చేసినట్టు ఇప్పటికే గుర్తించారు. కూపీలాగిన కొద్దీ లింకులు కదలుతున్నాయి. ట్యాపింగ్ ఎపిసోడ్‌లో ప్రణీత్‌కు సహకరించిన వరంగల్‌కు చెందిన ఇద్దరు సీఐలను కూడా ప్రశ్నిస్తోంది స్పెషల్ టీమ్. గతంలో ఈ ఆ ఇద్దరు ప్రణీత్ టీమ్‌లో కీలకంగా పనిచేసినట్టు గుర్తించారు పోలీసులు.
వరంగల్ జిల్లాకు చెందిన ఓ నాయకుడి ఆదేశాల మేరకే ఫ్రణీత్ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారా? విచారణ ఫ్రేమ్‌లో తెరపైకి వచ్చిన ఈ ప్రశ్న పొలిటికల్‌గా కలకలం రేపింది. ఈ క్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఫోన్‌ట్యాపింగ్‌తో తనకే సంబంధంలేదన్నారు. తన పేరు చెప్పాలంటూ ప్రణీత్‌రావును బెదిరిస్తున్నారని ఆరోపించారు ఎర్రబెల్లి. ఎలాంటి విచారణకైనా తాను సిద్దమని స్పష్టం చేశారు దయాకర్‌రావు.
ఇక, విచారణలో బాగంగా బంజారాహిల్స్ పీఎస్‌లో ప్రణీత్‌రావును వైడ్ యాంగిల్‌లో ప్రశ్నించింది స్పెషల్ టీమ్. గత ఆరేళ్లుగా ప్రణీత్ ఎలాంటి ఆపరేషన్స్ నిర్వహించారో ఆరా తీశారట. అలాగే ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్? టెక్నికల్ ఎవిడెన్స్‌ను ధ్వంసం చేయడం వెనక కారణాలేంటి? ట్యాపింగ్ చేసిన కాల్ రికార్డ్స్‌ను ఎవరికి ఎందుకు పంపించారు? అనే ప్రశ్నలు సంధిస్తూ కీలక డేటా సేకరించినట్టు తెలుస్తోందట. ఇక, ప్రణీత్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీ ఆధారంగా మరింత లోతుగా ఎంక్వయిరీ చేస్తున్నారు ప్రత్యేక బృందం పోలీసు అధికారులు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం