SGSTV NEWS
CrimeTelangana

మియాపూర్‌లో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌

వరల్డ్‌ వన్‌ స్కూల్‌లో రూ.7.85 లక్షలు చోరీ

మియాపూర్‌: మియాపూర్‌ పరిధిలోని ఓ పాఠశాలలో రూ.7.85 లక్షల నగదును చెడ్డీ గ్యాంగ్‌ దొంగిలించుకుపోయింది. సీఐ దుర్గా రామలింగ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌ న్యూ హాపీజ్‌ పేట వరల్డ్‌ వన్‌ స్కూల్‌లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కిటికిలోంచి పాఠశాలలోకి చొరబడి రిసెప్షన్‌లో లాకర్‌ను పగులగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు.

ఆదివారం ఉదయం పాఠశాల సిబ్బంది వచ్చి చూడగా లాకర్‌ పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి నల్లటి మాస్క్‌లను ధరించి, చెడ్డీలు వేసుకుని శనివారం అర్ధరాత్రి పాఠశాలలో చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

Also read

Related posts