కర్ణాటక: ‘ప్రేమించి పెళ్లి చేసుకో, లేకపోతే చస్తావు‘ అని యువకుడు వేధింపులకు పాల్పడటంతో బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన మండ్య తాలూకా చందగాలు గ్రామంలో జరిగింది. మృతురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన రంజిత కుమార్తె స్నేహ (17)ను ఇదే గ్రామానికి శోభిత్ గౌడ అనే యువకుడు కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. బాలిక తిరస్కరించినా వెంట పడేవాడు
బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో గ్రామ పెద్దలతో పంచాయతీ పెట్టారు. శోభిత్ గౌడను అదుపులో ఉంచుకోవాలని తండ్రికి హెచ్చరిక జారీ చేశారు. అయినా శోభిత్గౌడ తన ప్రవర్తనను మార్చుకోలేదు. అంతేగాకుండా స్నేహితులు క్రిషిక్ గౌడ, లేవిత్, మనోజ్ గౌడలతో కలిసి స్నేహ ఇంట్లోకి చొరబడ్డారు. స్నేహను, ఆమె తల్లిదండ్రులను వీధిలోకి ఈడ్చి, బూతులతో దూషించారు. శోభిత్ గౌడను పెళ్లి చేసుకోకపోతే చస్తావంటూ అతని స్నేహితులు బెదిరించారు.
అంతేగాకుండా క్రిషిక్ గౌడ కొడవలితో స్నేహ తండ్రి నింగ్రాజ్పై దాడి చేసి గాయపరిచాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్నేహ ఇంట్లోకి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. తలుపు పగలగొట్టి బయటకు తీసుకువచ్చి మిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి రంజిత ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్పీ శోభారాణి, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. శివల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Also read
- కార్తీక మాసంలో శివపార్వతుల శాంతి కళ్యాణం*
భద్రాచలం, నవంబరు 29: - ఏపీలో కొత్తగా ఏర్పడే 88 అసెంబ్లీ సీట్లు- జిల్లాల వారీగా ప్రతిపాదనలు.
- Baba Fasiuddin: హత్య ప్లాన్.. భగ్నం చేసిన బోరబండ పోలీసులు
- పెళ్లికి అడ్డు వస్తోందని ప్రియురాలి హత్య
- ర్యాపిడో డ్రైవర్ కాళ్లు విరగ్గొట్టారు..





