హైదరాబాద్: ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకోవడం.. పెళ్లి పేరుతో నమ్మకం కలిగించడం.. ఆ తర్వాత అందినకాడికి దోచుకోవడం.. ఇదీ ఆ యువకుడి నైజం. ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఖాతా సృష్టించి.. తాను సంపన్న వైద్యుడినంటూ ఓ యువతిని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి రూ. లక్షలు కాజేశాడు.
జాజుల గుణవంత్ అనే యువకుడు ఓ గిటారిస్ట్, మోడల్కు సంబంధించిన ఫొటోలను సేకరించి.. వాటితో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించాడు. తాను సంపన్న వైద్యుడినంటూ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని (24)కి పరిచయమయ్యాడు. క్రమంగా ఆమె వద్ద నమ్మకాన్ని సంపాదించి పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఆ తర్వాత కుటుంబంలో వివిధ అత్యవసర పరిస్థితులు ఉన్నాయంటూ డబ్బులు అవసరమని చెప్పి విడతలవారీగా రూ.10.05 లక్షలు తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా బంగారు ఆభరణాలు కూడా పంపించాలని కోరాడు. ర్యాపిడో కొరియర్ ద్వారా బాధితురాలి నుంచి బంగారు నగలను తెప్పించుకున్నాడు. మరోవైపు బాధితురాలి క్రెడిట్ కార్డును కూడా మోసపూరితంగా సంపాదించి.. ఓటీపీలను దుర్వినియోగం చేసి రూ.2.16 లక్షల రుణం పొందాడు. ఈ వ్యవహారంలో గుణవంతు అతని తల్లి పటూరి సురేఖ కూడా సహకరించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. పెళ్లి సంబంధం నిజమని నమ్మించేలా బాధితురాలితో మాట్లాడటంతో పాటు.. మోసం ద్వారా వచ్చిన సొమ్మును డిజిటల్ చెల్లింపుల ఖాతాల ద్వారా స్వీకరించినట్లు అభియోగాలున్నాయి. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తల్లీకొడుకులను అరెస్టు చేసి.. నిందితుడి నుంచి 20 గ్రాముల బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ స్వాదీనం చేసుకున్నారు.
Also read
- శ్రీరంగనాథుడి ఆలయంలోకి రానివ్వలేదు.. చివరకు అర్చకుడే భుజాలపై మోసుకెళ్లాడు!
- Hyderabad: డేటింగ్ యాప్‌లో పరిచయం.. కొమ్మా క్లబ్‌కు పిలిచి నిండా ముంచిన యువతి!
- తెలంగాణ ఈగల్ ఫోర్స్ దెబ్బ.. మహారాష్ట్రలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. కోట్ల విలువైన MD సీజ్!
- బెంగళూరులో నర్సింగ్ గ్రాడ్యుయేట్ మృతి.. ప్రియుడు అనుమానితుడు
- సంపన్న వైద్యుడినంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగినికి వల.. పెళ్లి పేరుతో భారీ మోసం





