అనకాపల్లి ఆనందపురం హైవేపై పోలీసుల తనిఖీలు చేశారు. బాట జంగాల పాలెం టోల్గేట్ వద్ద కాపు కాసిన పోలీసులకు అనుమానస్పదంగా ఒక కారు కనిపించింది. దాన్ని ఆపి తనిఖీ చేసేసరికి అందులో భారీ ఎత్తున మద్యం బాటిళ్లు తరలిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల సీజన్ సమీపిస్తుంది. దీంతో పోలీసులు నిఘా పెంచ్చారు. ఎక్కడికక్కడ ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహిస్తున్నారు. శివార్లలో కాపుకాసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. తాజాగా.. గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి ఆనందపురం హైవేపై పోలీసుల తనిఖీలు నిర్వహించారు.

బాట జంగాల పాలెం టోల్గేట్ వద్ద కాపు కాసిన పోలీసులకు అనుమానస్పదంగా ఒక కారు కనిపించింది. దాన్ని ఆపి తనిఖీ చేసేసరికి అందులో పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లు కనిపించాయి. వెరిఫై చేసి గోవా లిక్కర్‌గా గుర్తించారు పోలీసులు. 61 మద్యం పోటీలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆరుగురిని విచారించారు. గోవా నుంచి విమానంలో బయలుదేరి.. విశాఖ ఎయిర్ పోర్టులో దిగి.. ఆ తర్వాత కాకినాడకు కారులో వెళ్తున్నారు. అనకాపల్లి ఆనందపురం హైవేపై పోలీసుల తనిఖీల్లో పట్టుబడిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తనిఖీలు విస్తృతం చేశారు పోలీసులు. పట్టుబడిన మద్యం విలువ రూ.30 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు పోలీసులు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025