పోలవరం జిల్లా: గంజాయి తరలిస్తున్న కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పేర్చిన ఇటుకల గోడతోపాటు మరో రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటన ఎటపాకలో చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కారులో 35 కేజీల గంజాయి బయటపడింది.
ఒడిశా నుంచి తెలంగాణకు గంజాయిని తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి తరలిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇటుకల గోడను ఢీకొట్టడంతో పాటు మరో రెండు వాహనాలను ఢీకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారును తనిఖీ చేశారు. అందులో 35 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
Also read
- మరోసారి టాలీవుడ్లో పైరసీ కలకలం.. రిలీజ్ అయిన రోజే ఆన్లైన్లోకి.. పోలీసుల కేసు నమోదు!
- ఎటపాకలో గంజాయి కారు బీభత్సం.. పోలీసుల తనిఖీల్లో షాక్!
- Hayathnagar: ఫోన్ చూడొద్దని తల్లి మందలించిందని.. తనువే చాలించింది..
- అయ్యప్ప మాల వేసుకుంటుండగా భక్తుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతి..!
- కారులో లిఫ్ట్ ఇస్తామని నమ్మించి.. 40 గ్రాముల బంగారం దోపిడీ!





