SGSTV NEWS online
Spiritual

Bhagavad Gita: అవయవదానం చేయడం హిందూ ధర్మం ప్రకారం మంచిదేనా? భగవద్గీత ఏం చెబుతుందో తెలుసా?

మరణించిన తర్వాత అవయవాలను దానం చేయడం హిందూ ధర్మం ప్రకారం మంచిదేనా? అవయవదానం చేస్తే పుణ్యం వస్తుందా? దీనిపై భగవద్గీత, మహాభారతం, పురాణాలు ఏం చెబుతున్నాయి? దక్ష ప్రజాపతి, గణేశుడి కథల నుంచి శ్రీకృష్ణుడి గీతాబోధన వరకు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.


అవయవదానం.. ఒకరి మరణం తర్వాత మరొకరికి కొత్త జీవితాన్ని ప్రసాదించే గొప్ప దానం. ప్రమాదాలు, అనారోగ్య సమస్యల కారణంగా అవయవాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతోమందికి అవయవ మార్పిడి కొత్త ఆశను కల్పిస్తుంది. అయితే హిందూ ధర్మం ప్రకారం మరణించిన తర్వాత శరీరంలోని అవయవాలను దానం చేయడం సమంజసమేనా? భగవద్గీత, వేదాలు, పురాణాలు దీనిపై ఏం చెబుతున్నాయి? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. నిజానికి భగవద్గీతలో కానీ, వేదాల్లో కానీ అవయవదానంపై ప్రత్యేకమైన ఆదేశాలు కనిపించవు. అయితే వాటిలో వివరించిన ధర్మం, దయ, త్యాగం, సేవాభావం వంటి సూత్రాల ఆధారంగా అవయవదానాన్ని అర్థం చేసుకోవచ్చు.


మంచి పనిని నిర్ణయించేది ఏది?
మహాభారతం ప్రకారం ఒక పని మంచిదా? చెడ్డదా? అని నిర్ణయించడానికి ప్రధానంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవి.. చేసే పని స్వభావం, ఆ పని చేయడం వెనుక ఉన్న ఉద్దేశం, దాని వల్ల కలిగే ఫలితాలు. ఈ మూడు అంశాల ఆధారంగా అవయవదానాన్ని పరిశీలిస్తే.. ఒకరి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో చేసే అవయవదానం గొప్ప సేవగా పరిగణించవచ్చు.

పురాణాల్లో అవయవ మార్పిడికి ఉదాహరణలు
హిందూ పురాణాల్లో అవయవ మార్పిడిని పోలిన కొన్ని ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. దక్ష ప్రజాపతి తలను శివుడు ఖండించిన తర్వాత, యజ్ఞ పశువు తలను ఆయన శరీరానికి అమర్చి తిరిగి ప్రాణం పోశారని పురాణ కథనం చెబుతుంది. అలాగే గణేశుడి తల తెగిపోయినప్పుడు, శివుడు ఏనుగు తలను అమర్చి తిరిగి జీవం ప్రసాదించినట్లు కథనం ఉంది. ఇవి ఆధునిక వైద్య విధానంలో జరిగే అవయవ మార్పిడికి పూర్తిస్థాయి పోలికలు కాకపోయినా, శరీర భాగాన్ని మార్చడం ద్వారా జీవాన్ని కాపాడవచ్చనే భావనను సూచిస్తాయి.

Also read

Related posts