హైదరాబాద్: కేపీహెచ్‌బీ పరిధిలోని ఎంజీ నివాసంలో గత నెల 27న కుమార్తెను హత్య చేసిన అనంతరం దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో పోలీసులకు కీలక ఆధారం లభించింది. ఆత్మహత్యకు ముందు గోపీనాథ్, సమత ఇంటి గోడపై రాసిన లేఖలో తమ మరణాలకు ఇతరులెవరూ కారణం కాదని, ఎవరినీ విచారించవద్దని పేర్కొన్నారు.
ఈ క్రమంలో కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్‌హెచ్‌వో విజయకుమార్.. పశ్చిమ బెంగాల్ నుంచి దంపతుల కుటుంబ సభ్యులను రప్పించి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో సమత రాసుకున్న డైరీ పోలీసులకు లభ్యమైంది. అది బెంగాలీ భాషలో ఉండటంతో కుటుంబ సభ్యులు చదివి హిందీలో పోలీసులకు వివరించారు.
గోపీనాథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమత.. తన భర్త గతంలో మాదిరిగా ప్రేమగా ఉండటం లేదని డైరీలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనపై ఆయనకు ప్రేమ తగ్గిపోయిందని, తనను పట్టించుకోవడం లేదని రాసుకున్నట్లు సమాచారం. తన వైపు నుంచి భర్తపై ప్రేమ ఉన్నప్పటికీ.. ఆయన నుంచి అదే స్థాయిలో ప్రేమ లభించడం లేదని, అనవసరంగా ఆయన జీవితంలోకి వచ్చానని వాపోయినట్లు వెల్లడైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో దంపతుల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు కొనసాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ జీవితంలో ఎదురైన సమస్యలు, పరస్పర విభేదాల కారణంగా వారు తీవ్ర మానసిక వేదనకు గురై ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.
Also read
- శ్రీకాకుళంలో బీజేపీ నేత వీరంగం
- మా ఆయన నన్ను లవ్ చేయట్లేదు!
- రైలు ఢీకొని యువతి దుర్మరణం
- సినిమా అవకాశాల పేరుతో నగ్న చిత్రాలు తీసి..
- మహబూబాబాద్ యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్..సూసైడ్ నోట్ ఆధారంగా ప్రియుడు సహా ఆరుగురు అరెస్ట్





