SGSTV NEWS online
CrimeTelangana

ఓఆర్‌ఎస్‌’ అనుకుని… ఎలుకల మందు తాగడంతో విషాదం!

‘

హైదరాబాద్‌, ఘట్‌కేసర్‌: ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌ అనుకొని ఓ మహిళ ఎలుకల మందు తాగిన సంఘటన ఘట్‌కేసర్‌ పీఎస్‌ పరిధిలో జరిగింది. ఎదులాబాద్‌కు చెందిన తోటకూర రాములమ్మ (73) గురువారం స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడిని సంప్రదించింది. రెండు రోజులుగా నీరసంగా ఉందని, ఓఆర్‌ఎస్‌ తాగినా కూడా తగ్గలేదని చెప్పింది.

ఆమె కొడుకుకు సందేహం వచ్చి హుటాహుటిన ఇంటికి వెళ్లి ఆమె తాగి పారేసిన ఖాళీ కవర్‌ను చూడగా అది ఎలుకల మందు ప్యాకెట్‌. ఆర్‌ఎంపీ వైద్యుడి సూచన మేరకు వెంటనే ఆమెను ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు, రాములమ్మ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts