రాజకీయ వివాదమే కారణమని బాధితుల ఆవేదన విచారిస్తున్న సీఐ విజయ్‌కుమార్, తహసీల్దారు అనితకుమారి
వాసవీ పెనుగొండ : వాసవీ పెనుగొండ మండలం ములపర్రు శివారు పితానివారిపాలెం గ్రామంలో పది కుటుంబాలను వెలివేయటం కలకలం రేపుతోంది. ఇటీవల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా తలెత్తిన రాజకీయ వివాదం తమ కుటుంబాల పాలిట శాపంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే సామాజికవర్గానికి చెందిన ఊరిలో ఇంటిపేరు ఆధారంగా గ్రామపెద్దలు ఆంక్షలు విధించారని ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్షతోనే గ్రామంలో తమకు నిత్యావసర వస్తువులు, మంచినీరు అందకుండా చేస్తున్నారని, పక్కింటి నుంచి తాగునీటిని తెచ్చుకునేందుకు కూడా అనుమతించటం లేదని చెబుతున్నారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న కొంతమందిని ఖాళీ చేయించారని తెలిపారు. దాడులు చేస్తారనే భయంతో తమ పిల్లలను పాఠశాలకు పంపించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. తహసీల్దారు అనితకుమారి, సీఐ విజయ్‌కుమార్, ఎస్సై గంగాధరరావు గురువారం పితానివారిపాలెంలో పర్యటించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తహసీల్దారు తెలిపారు.
Also read
- Labh Panchami: లాభ పంచమి ఎప్పుడు? ఈ రోజున ఇలా చేస్తే వ్యాపారంలో లాభాలే లాభాలట!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- కార్తీక పురాణం..5వ రోజు
- మేనకోడలి పెళ్లి చెడకొట్టేందుకు యువకుడి పన్నాగం
- పితానివారిపాలెంలో పది కుటుంబాల వెలి!





