హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య వెలుగుచూసింది. జిల్లెలగూడ దత్తునగర్లోని శ్రీలక్ష్మీ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో అనిత (35) అనే మహిళ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తల్లిని ఆ స్థితిలో చూసి షాక్‌కు గురయ్యారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు..
హైదరాబాద్, నవంబర్ 12: హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య కలకలం రేపింది. మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ దత్తునగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీలక్ష్మీ రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని మూడో అంతస్తులో అనిత (35) అనే మహిళ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. తమిళనాడుకు చెందిన అరుణ్ కుమార్ కుటుంబం గత నాలుగేళ్లుగా ఇదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. కాగా, స్కూల్‌కు వెళ్లిన పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేసరికి తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే తండ్రి అరుణ్ కుమార్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో అనితను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న మీర్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనితను ఎవరు హత్య చేశారు? హత్యకు గల కారణాలేంటి? కుటుంబ కలహాలా.. మరేదైనా కారణమా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుండగా, పోస్టుమార్టం నివేదికతో పాటు పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Also read
- ఫ్రెండ్‌తోనే పురుగుల మందు తాగించిన తోటి విద్యార్థులు
- రాప్తాడు నిందితుడు హేమంత్‌కు మరో ఆరోగ్య సమస్య.. ఊపిరితిత్తుల రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తం!
- స్కూల్ నుంచి ఇంటికొచ్చిన పిల్లలకు షాక్.. రక్తపు మడుగులో తల్లి! ఏం జరిగిందంటే..?
- అర్ధరాత్రి ఏటీఎం దోచేద్దామనుకున్నాడు.. అలారమే దొంగకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది!
- వీధి కుక్కల దాడిలో నవజాత శిశువు దుర్మరణం





