SGSTV NEWS online
Spiritualకార్తీకపురాణం

Karthika Masam: కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం.. ఈ మాసంలో వచ్చే పండుగలు, పుణ్య తిథులు ఇవే!





Karthika Masam Festivals Telugu: శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తిక మాసం 2026లో నవంబర్ 10న ప్రారంభమై డిసెంబర్ 8న ముగియనుంది. ఈ పవిత్ర మాసంలో వచ్చే నాగుల చవితి, ప్రబోధన ఏకాదశి, కైశిక ద్వాదశి, కార్తిక పౌర్ణమి, మాస శివరాత్రి వంటి ముఖ్య పండుగలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు తెలుసుకోండి.


Karthika Masam Festivals: శివకేశవుల భక్తులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. తెలుగు పంచాంగం ప్రకారం ఎనిమిదో మాసమైన కార్తీకానికి సనాతన ధర్మంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. దీపారాధన, తులసీ పూజ, శివాభిషేకాలు, ఉపవాసాలు, దానధర్మాలతో ఈ మాసమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో వెలిగించే దీపం, చేసే పూజలు, వ్రతాలు ఎంతో పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ‘కార్తీకం’ అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసం శివారాధనతో పాటు శ్రీమహావిష్ణువు ఆరాధనకూ ఎంతో విశిష్టమైనది. 2026లో కార్తిక మాసం నవంబర్ 10, మంగళవారం ప్రారంభమై డిసెంబర్ 8, మంగళవారం అమావాస్యతో ముగియనుంది.


కార్తీక మాసంలోని ముఖ్య పండుగలు, పుణ్య తిథులు

👉 నవంబర్ 10న కార్తీక శుద్ధ పాడ్యమి సందర్భంగా బలి పాడ్యమి, ఆకాశదీపారంభం జరుగుతాయి.

👉  నవంబర్ 11న యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం నిర్వహిస్తారు

👉 నవంబర్ 13న నాగుల చవితి సందర్భంగా నాగదేవతలను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

👉  నవంబర్ 15న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవానికి అంకురార్పణ, తిరుమంగైయాళ్వార్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

👉  నవంబర్ 16న కోటి సోమవారం

👉  నవంబర్ 17న వృశ్చిక సంక్రమణం

👉  నవంబర్ 19న యాజ్ఞవల్క జయంతి

👉  నవంబర్ 20న ప్రబోధన ఏకాదశి

👉  నవంబర్ 21న క్షీరాబ్ది ద్వాదశి.. కైశిక ద్వాదశి, చాతుర్మాస వ్రత సమాప్తి వంటి విశేష పర్వదినాలు ఉన్నాయి. తిరుమలలో ఈ సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

👉  నవంబర్ 22న పక్ష ప్రదోషం

👉  నవంబర్ 24న కార్తిక పౌర్ణమి జరుపుకుంటారు. కార్తిక పౌర్ణమి రోజున జ్వాలా తోరణం, కృత్తికా దీపోత్సవం వంటి విశేష కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటాయి.

👉 నవంబర్ 27న సంకష్టహర చతుర్థి

👉  డిసెంబర్ 4న కార్తీక బహుళ ఏకాదశి

👉  డిసెంబర్ 6న పక్ష ప్రదోషం

👉  డిసెంబర్ 7న మాస శివరాత్రి వస్తాయి.

👉  చివరగా డిసెంబర్ 8న కార్తిక అమావాస్యతో పవిత్ర కార్తిక మాసం ముగుస్తుంది.

కార్తీక మాసంలో వీలైనంత వరకు ప్రతిరోజూ దీపారాధన చేయడం, తులసీ పూజ, శివాభిషేకం, విష్ణు ఆరాధన, ఉపవాసం, దానధర్మాలు చేయడం శ్రేయస్కరమని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర మాసంలో భక్తిశ్రద్ధలతో పూజలు, వ్రతాలు ఆచరించి శివకేశవుల అనుగ్రహం పొందుదాం.

Related posts