హైకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని నిర్ధారించిన తెలంగాణ హైకోర్టు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి ఆరు నెలల సాధారణ జైలుశిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. అయితే తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ జైలుశిక్ష అమలును నాలుగు వారాలపాటు నిలిపివేసింది.
హైకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని నిర్ధారించిన తెలంగాణ హైకోర్టు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి ఆరు నెలల సాధారణ జైలుశిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. అయితే తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ జైలుశిక్ష అమలును నాలుగు వారాలపాటు నిలిపివేసింది.
ఈ కేసు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయాంజల్ పరిధిలోని మన్నె ముత్యాలమ్మ కుంట ప్రాంతంలో ఉన్న భూములకు సంబంధించినది. సర్వే నంబర్లు 536, 537, 657, 658 పరిధిలోని ప్లాట్లపై వివాదం నెలకొంది. తమకు చెందిన 59, 62వ నంబర్ ప్లాట్ల తూర్పు భాగాన్ని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలంటూ బాధితులు 2024 మార్చిలో కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకోవాలని 2025 ఆగస్టు 5న హైకోర్టు ఆదేశించింది. 60 రోజుల్లో నిర్ణయం ప్రకటించాలని స్పష్టం చేసినప్పటికీ కలెక్టర్ గడువులోగా స్పందించలేదు. దీంతో బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా ఒకే లేఅవుట్లోని ఇతర ప్లాట్లను గతంలో నిషేధిత జాబితా నుంచి తొలగించి, పిటిషనర్ల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్ణయానికి సరైన కారణాలు చూపలేదని పేర్కొంది. గత ఉత్తర్వులు తప్పనిపిస్తే అప్పీల్‌కు వెళ్లాలి తప్ప, వాటిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని జస్టిస్ కె. లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వక కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ శిక్ష విధించారు. నాలుగు వారాల్లో జరిమానా చెల్లించాలని, అప్పీల్ కోసం జైలుశిక్ష అమలుపై తాత్కాలిక స్టే ఇచ్చారు. నాలుగు వారాల్లో జరిమానా చెల్లించాలని, జైలుశిక్ష అమలును అప్పీల్ చేసుకునేందుకు వీలుగా 4 వారాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
Also read
- కార్తీక పురాణం 2వ రోజు
- గురు గ్రహ సంచారంతో ఈ 5 రాశుల వారికి అదృష్టం.. రాబోయే 79 రోజులు పట్టిందల్లా బంగారమే!
- హైకోర్టు సంచలన తీర్పు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆరు నెలల జైలుశిక్ష!
- లోన్ యాప్ వేధింపులు.. హైదరాబాద్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య..!
- ప్రధాన నిందితుడు ఎవరి మనిషో తేలాల్సి ఉంది: నేరెళ్ల శారద





