Police Officer Death: టపాసులు కాల్చే విషయంలో జరిగిన చిన్నపాటి వాగ్వాదం చివరకు ఓ పోలీసు అధికారి ప్రాణాలు తీసింది.. రోడ్డుపై బాణసంచా కాల్చవద్దని చెప్పినందుకు స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎఎస్ఐ సెంథిల్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు.. ఈ షాకింగ్ ఘటన తమిళనాడు తీవ్ర కలకలం సృష్టించింది.. తేని జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది..
విధులు ముగించుకుని సాధారణ దుస్తుల్లో ఇంటికి వెళ్తున్న సెంథిల్ కుమార్.. రోడ్డుకు అడ్డంగా నిలబడి టపాసులు కాల్చుతున్న కొందరిని గమనించారు.. ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని, రోడ్డుపై బాణసంచా కాల్చవద్దని వారిని హెచ్చరించారు.. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.. ఈ క్రమంలో ఆ గుంపులోని ఓ వ్యక్తి సెంథిల్ కుమార్ను తోసేయడంతో పాటు మోచేతితో బలంగా కొట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.. మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు.. పండుగ రోజున పోలీసు సిబ్బందితో సహా రాష్ట్రవ్యాప్తంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.. రాష్ట్రంలో టపాసుల శబ్దాల కంటే కొడవళ్లతో జరుగుతున్న దాడులే ఎక్కువగా వినిపిస్తున్నాయంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Also read
- ప్రధాన నిందితుడు ఎవరి మనిషో తేలాల్సి ఉంది: నేరెళ్ల శారద
- Police Officer Death: షాకింగ్.. రోడ్డుపై టపాసులు కాల్చవద్దన్నందుకు పోలీసు అధికారి హత్య..
- రాయిగంజ్లో మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసులో నిందితుడు కాల్చి చంపిన పశ్చిమ బెంగాల్ పోలీసులు
- రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర SI
- చిత్తూరులో దారుణం.. ఇచ్చిన డబ్బులు అడిగినందుకు కారుతో గుద్ది దారుణ హత్య!





