తెలంగాణలో ధరణి పోర్టల్ భూ రికార్డుల అక్రమాల కేసులో సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా, ఇప్పటివరకు తొమ్మిది మందిపై చర్యలు తీసుకుంది. 15 ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహించిన అధికారులు, ఫోరెన్సిక్ ఆధారాలతో భూ రికార్డుల మార్పుల వెనుక ఉన్న వ్యక్తుల పాత్రను పరిశీలిస్తున్నారు.
ధరణి పోర్టల్లో భూ రికార్డుల అక్రమ మార్పుల వ్యవహారంపై తెలంగాణ సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో తాజాగా మరో ఐదుగురిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా, తాజాగా ఐదుగురిని అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మందిపై చర్యలు తీసుకున్నట్లయింది. ధరణి పోర్టల్ అక్రమాలపై సీఐడీ రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఇందుకోసం 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఏకకాలంలో విస్తృతంగా సోదాలు చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, గజ్వేల్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ధరణి పోర్టల్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని విచారణ చేపట్టింది.
పోర్టల్లోకి అక్రమంగా లాగిన్ అయి భూముల రికార్డులను మార్చినట్లు సీఐడీ అనుమానిస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్లో వెలుగుచూసిన డిజిటల్ ఆధారాల ఆధారంగా అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా విలువైన భూముల యాజమాన్య హక్కులను అక్రమంగా మార్చిన వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు.
కోర్టు కేసులు, మధ్యంతర ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని భూముల రికార్డుల్లో మార్పులు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే భూదాన్ భూములకు బైనంబర్లు సృష్టించి యాజమాన్య హక్కులను మార్చిన వ్యవహారంపైనా సీఐడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ధరణి పోర్టల్ అక్రమాలపై సీఐడీ డీజీ చారుసిన్హా నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు, పోర్టల్ లాగిన్ వివరాలు, భూ రికార్డుల మార్పుల వెనుక ఉన్న వ్యక్తుల పాత్రను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Also read
- Diwali: దీపావళికి ఏ లక్ష్మీ-గణేశ విగ్రహాలను కొనాలి? ఏ రూపం శుభప్రదమో తెలుసా?
- నందా దీపం ఎప్పుడు వెలిగించాలి..? లక్ష్మీ కటాక్షం కోసం దీపావళి రోజున ఈ పనులు తప్పక చేయండి..
- కన్న కొడుకు కోరిక తీర్చిన తల్లిదండ్రులు.. 24 గంటలు గడవకముందే తీరని విషాదం!
- ధరణి అక్రమాల కేసులో సీఐడీ దూకుడు.. మరో ఐదుగురు అరెస్ట్.. ఇప్పటివరకు 9 మందిపై చర్యలు
- Hyderabad: గచ్చిబౌలి హోటల్లో అమెరికా వాసి అనుమానాస్పద మృతి





