Cyber Fraud: ఈ ఘటనపై బాధిత పోలీస్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. +1 (425) 880-2035, +91 9214807284 నంబర్లతో పాటు నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్లు, బ్యాంకు లావాదేవీలపై పోలీసులు..
Cyber Fraud: సైబర్ నేరగాళ్ల వలలో ఓ పోలీస్ కానిస్టేబుల్ చిక్కుకుని ఏకంగా రూ.29.20 లక్షలు పోగొట్టుకున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా పరిచయమైన కేటుగాళ్లు డార్విన్‌ఎక్స్ గ్లోబల్ (Darwinex Global) పేరిట నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్‌లు, యాప్‌లతో భారీ మోసానికి పాల్పడ్డారు.
జీరో కమిషన్, భారీ లాభాలు వస్తాయంటూ నమ్మబలికిన నిందితులు, సుకన్య రెడ్డి పేరిట చాటింగ్ చేస్తూ అప్పర్ సర్క్యూట్ ట్రేడింగ్ పేరుతో బాధితుడి నమ్మకాన్ని పొందారు. దశలవారీగా పెట్టుబడులు పెట్టించేలా చేసి బాధితుడి నుంచి రూ.29,20,659 కొల్లగొట్టారు. యాప్‌లో ఏకంగా రూ.76 లక్షల లాభం వచ్చినట్లు చూపిస్తూ బాధితుడిని మరింతగా నమ్మించారు. అయితే డబ్బులు విత్‌డ్రా చేసుకునే సమయంలో ట్యాక్స్, ఎక్స్ఛేంజ్ ఛార్జీలు అంటూ అదనంగా భారీ మొత్తంలో నగదు చెల్లించాలని డిమాండ్ చేయడంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై బాధిత పోలీస్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. +1 (425) 880-2035, +91 9214807284 నంబర్లతో పాటు నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్లు, బ్యాంకు లావాదేవీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- గే డేటింగ్ యాప్‌లో పరిచయం.. తియ్యని మాటలతో యువకుడి కొంపముంచిన కేటుగాడు..
- Cyber Fraud: పోలీసు కానిస్టేబుల్‌కే టోకరా.. రూ.29 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు.. సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు!
- హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!
- Raptadu Case Update: హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై బిగ్ అప్డేట్
- వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే?





