SGSTV NEWS online
Andhra PradeshCrime

పోలీసులపైకే తిరగబడ్డ రాప్తాడు నిందితుడు హేమంత్.. ఆరు రౌండ్ల కాల్పులు!



రాప్తాడు కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో హేమంత్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అతడిని పట్టుకునేందుకు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులపై హేమంత్ తిరగబడినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హేమంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


అనంతపురం: రాప్తాడు కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో హేమంత్‌ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అతడిని పట్టుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసులపై తిరగబడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాప్తాడు ఘటనకు సంబంధించి నిందితుడు హేమంత్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అతడు ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని హేమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను ప్రతిఘటిస్తూ హేమంత్‌ తిరగబడినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. మొత్తం ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో హేమంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, హేమంత్‌ దాడిలో సీఐ వెంకటేశ్వర్లు చేతికి గాయాలు అయ్యాయి.

ఆత్మకూరు అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హేమంత్‌ పోలీసులపై తిరగబడటానికి గల కారణాలు, కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల అధికారిక ప్రకటన వెలువడితే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపుతోంది. తరగతి గదిలోకి చొరబడిన హేమంత్ పవర్‌ చైన్‌సాతో బాలికపై దాడి చేయడంతో ఆమె ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది. తీవ్రంగా గాయపడిన బాలికను తొలుత అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి బెంగళూరుకు తీసుకెళ్లారు.

Also read

Related posts