SGSTV NEWS online
CrimeTelangana

పెళ్లయిన రెండు నెలలకే భర్త కువైట్ వెళ్లడంతో!



సిరిసిల్ల అర్బన్: కొత్త ఆశలు.. ఎన్నో కలలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన యువతి.. ఒంటరితనం భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయిన రెండు నెలలకే తనువు చాలించింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా చంద్రంపేటకు చెందిన కటకం సుదర్శన్-లావణ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు.

పెద్ద కూతురు గాజుల(కటకం) అశ్రిత(24)ను రెండు నెలల కిత్రం వేములవాడ మండలం జోగాపురం గ్రామానికి చెందిన గాజుల రాజశేఖర్కు ఇచ్చి పెళ్లి చేశారు. రాజశేఖర్ 20 రోజుల క్రితం గల్ఫ్ బాట పట్టడంతో అశ్రిత బతుకమ్మ పండుగ కోసం చంద్రంపేటలోని తల్లిగారింటికి వచ్చింది. భర్త ఉపాధి కోసం కువైట్ వెళ్లడంతో ఒంటరితనం భరించలేక తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Also read

Related posts