విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంటలో బంగారం మెరుగు పెడతామంటూ ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను మోసం చేశారు. ఆభరణాలను శుభ్రం చేస్తామని నమ్మించి రెండున్నర తులాల బంగారు తాడును అపహరించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అపరిచితులకు బంగారు ఆభరణాలు అప్పగించవద్దని హెచ్చరిస్తున్నారు.
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంటలో బంగారం మెరుగు పేరుతో మోసం జరిగింది. కాలేజీ సమీపంలో ఓ మహిళను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మాటల్లో పెట్టారు. బంగారు ఆభరణాలకు మెరుగు పెడతామంటూ ఆమెను నమ్మించారు. వారి మాటలు నమ్మిన మహిళ.. బంగారు తాడును వారికి అప్పగించింది. ఇదే అదనుగా భావించిన మోసగాళ్లు.. మహిళ దృష్టి మరల్చి రెండున్నర తులాల బంగారు తాడు ఎత్తుకెళ్లారు. మోసపోయానని గుర్తించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటికి వచ్చి బెల్ కొట్టడంతో చుట్టాలేమోనని తలుపు తీయగా బంగారానికి మెరుగు పెడతామని చెప్పి ఇద్దరు వ్యక్తులు మాయచేశారన్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు.
ఈ ఘటన సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించి.. వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అపరిచిత వ్యక్తులు బంగారం శుభ్రం చేస్తామన్నా.. మెరుగు పెడతామన్నా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. బంగారం మెరుగు పేరుతో అపరిచితులకు ఆభరణాలు అప్పగించవద్దని హెచ్చరించారు.
Also read
- మేనబావతో పెళ్లి ఇష్టం లేక రైల్లోనుంచి దూకి యువతి
- పెళ్లయిన రెండు నెలలకే భర్త కువైట్ వెళ్లడంతో!
- Andhra News: ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
- పోలీస్ సైరన్ కు భయపడి పరుగులు తీసి..
- Andhra Pradesh: చుట్టాల్లా వస్తారు.. ఇలాంటి వాళ్లతో జాగ్రత్త.. మాయలో పడ్డారో అంతే సంగతులు..





