SGSTV NEWS online
CrimeTelangana

Khammam: బాత్రూంలోకి వెళ్లి.. విగతజీవిగా బయటకు.. బీసీ హాస్టల్‌లో విద్యార్థి అనుమానాస్పద మృతి!



ఖమ్మంలోని బీసీ హాస్టల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఏఎస్‌ఆర్‌ కాలేజీలో ఎంఎల్‌టీ సెకండ్ ఇయర్ చదువుతున్న 17 ఏళ్ల అజయ్ బాత్రూంలో కుప్పకూలి మృతి చెందాడు. తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్ చూస్తూ సరదాగా గడిపిన అజయ్.. బాత్రూంకు వెళ్లి ఎంతకీ తిరిగి రాకపోవడంతో స్నేహితులు తలుపులు తెరిచి చూడగా విగతజీవిగా కనిపించాడు.


తోటి విద్యార్థులతో కలిసి సరదాగా గడిపాడు.. వారితో కలిసి క్రికెట్ మ్యాచ్ చూశాడు. అంతలోనే బాత్రూంకు వెళ్లిన ఆ విద్యార్థి ఎంతకీ తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన స్నేహితులు తలుపులు తెరిచి చూడగా.. విగతజీవిగా కనిపించాడు. ఆసుపత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఖమ్మంలోని బీసీ హాస్టల్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఖమ్మంలోని ఏఎస్‌ఆర్‌ కళాశాలలో ఎంఎల్‌టీ సెకండ్ ఇయర్ చదువుతున్న అజయ్ (17) బీసీ హాస్టల్‌లో ఉంటున్నాడు. శుక్రవారం తోటి విద్యార్థులతో కలిసి హాస్టల్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ సంతోషంగా గడిపాడు. ఆ తర్వాత బాత్రూంకు వెళ్లిన అజయ్ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో స్నేహితులకు అనుమానం వచ్చింది. దీంతో వారు బాత్రూం తలుపును బలవంతంగా తెరిచి చూడగా.. అజయ్ లోపల కుప్పకూలి కనిపించాడు.


వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అజయ్ గుండెపోటుతో చనిపోయాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతి చెందాడంటూ విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఆరోపించారు. అజయ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం ఆసుపత్రి మార్చురీ వద్ద ఆందోళన చేపట్టారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.


అజయ్ మృతితో అతడి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకు తమతో కలిసి నవ్వుతూ గడిపిన స్నేహితుడు ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో తోటి విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Also read

Related posts