SGSTV NEWS online
Andhra PradeshCrime

రాప్తాడు విద్యార్థిని దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియన్.. పోలీసులకు కీలక ఆదేశాలు


రాప్తాడులో పాఠశాల విద్యార్థినిపై జరిగిన దాడిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. స్కూల్‌లో విద్యార్థిని ఇలా దాడి జరగడం అమానుషమన్నారు.విద్యార్థినిపై దాడికి పాల్పడిన నిందితుడిని వెంటనే పట్టుకోవాలని.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని చట్టప్రకారం శిక్షించాలని పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే చిన్నారికి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షించాలని అధికారులకు సూచించారు.


రాప్తాడులో పాఠశాల విద్యార్థినిపై జరిగిన అమానుష దాడి ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల తరగతి గదిలోనే రంపంతో విద్యార్థినిపై దాడి చేయడం అత్యంత అమానుషమన్నారు సీఎం చంద్రబాబు. దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశారు జారీ చేశారు. బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థినిపై దాడికి పాల్పడిన నిందితుడిని వెంటనే పట్టుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని చట్టప్రకారం శిక్షించాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చిన్నారుల భద్రత విషయంలో ఇలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణించాలన్నారు.


అలాగే ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్లాస్ రూములో నెత్తుటి మడుగులో ఉన్న చిన్నారిని చూసి కన్నీళ్లు ఆగడం లేదన్న నారా లోకేష్. ఈ ఘటన తన గుండెను బరువెక్కించిందని బాధ పడ్డారు. ఉన్మాదుల దుశ్చర్యలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. ఆడపిల్లలు, మహిళల జోలికి రావాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చిన్నారులు, మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని వెల్లడించారు. పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవనన్నారు. బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు.




మరోవైపు ఈ ఘటనపై హోం మంత్రి అనిత స్పందిస్తూ అనంతపురం జిల్లా SP తో ఫోన్లో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. తీవ్ర గాయాల పాలైన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి.. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అధికారులకు ఆదేశించారు. బాధిత బాలికకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సత్యకుమార్ భరోసా ఇచ్చారు.




రాప్తాడులో విద్యార్థినిపై దాడి ఘటన.. స్పందించిన హోంమంత్రి అనిత ….

Also read

Related posts