ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. దీని ప్రభావం వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాకుండా కొన్ని సార్లు శని ప్రభావం కూడా జీవితంలో మంచిని తీసుకొస్తుంది. అయితే ప్రస్తుతం కుంభ రాశి, మీన రాశి, మేష రాశి వారు ఏలినాటి శనితో బాధపడుతున్నారు. అయితే అటువంటి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం చూసేద్దాం.
జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శని ఒక వ్యక్తి చేసే మంచి చెడుల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. ఇక శని అయితే ఏ రాశిలోకి సంచారం చేస్తుందో, ఆ రాశి వారికి అప్పటి నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది దాదాపు ఏడున్నర సంవత్సరాలు దీని ప్రభావం ఉంటుంది. ఇక శని దేవుడు ఒక వ్యక్తిపై తన దృష్టిని సారించనప్పుడు అతనిపై చాలా ప్రభావం ఉంటుంది.ఆ సమయంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.
అయితే ప్రస్తుతం మూడు రాశుల వారు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. ఈ సమయంలో శని ప్రభావం వలన మానసిక ఒత్తిడి అధికం అవ్వడం, ఆర్థికంగా, వృత్తి పరంగా ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కోవడం జరుగుతుంది. అంతే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. అందువలన ఏలి నాటి శని సమయంలో దాని ప్రభావం కాస్త తగ్గించుకోవాలి అంటే కొన్ని పరిహారాలు పాటించాలంట.
కాగా ఎలాంటి పరిహారాలు పాటించడం వలన ఏలి నాటి శని నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చునో, ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతం కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ కొనసాగుతుంది. ఇక మీన రాశి వారికి ఏలి నాటి శని రెండో దశ కొనసాగుతుంది. మేష రాశి వారికి మొదటి దశ కొనసాగుతుంది. అయితే ఈ రాశుల వారు ఏలి నాటి శని ప్రభావం నుంచి బయటపడాలి అంటే తప్పకుండా ప్రతి రోజూ శని దేవుడిని ప్రార్థించడం, పూజించడం చాలా అవసరం.
ఎవరు అయితే ప్రతి శని వారం లేదా ప్రతి రోజూ ఉదయం స్నానం చేసిన , ఇంటిని శుభ్రం చేసిన తర్వాత శని దేవుడిని పూజిస్తారో, వారికి కాస్త ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా సానుకూలత పెరుగుతుంది. అలాగే ప్రతి రోజూ శని స్త్రోత్రాన్ని పాటించడం, శని దేవుడికి నల్ల నువ్వులు, పూల మాల సమర్పించడం వలన కూడా శని ప్రభావం తగ్గుతుందంట. అంతే కాకుండా ప్రతి శని వారం రోజున హనుమాన్ టెంపుల్కి వెళ్లి అక్కడ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి, దాన ధర్మాలు చేయాలి.
మరీ ముఖ్యంగా రావి చెట్టును పూజించి, శని వారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. ఆవ నూనెతో దీపం వెలిగించి , రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఏలినాటి శని ప్రభావం నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందంట.
