SGSTV NEWS online
Crime

అరెస్ట్ చేయకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్! అనిశా అదుపులో బంజారాహిల్స్ ఎస్సై విజయ్


బంజారాహిల్స్,  చీటింగ్ కేసుతో పాటు మరో కేసులో అరెస్టు చేయకుండా ఉండేందుకు డబ్బులు ఇవ్వాలని నిందితుడిని డిమాండ్ చేశారన్న ఆరోపణలతో హైదరాబాద్ బంజారాహిల్స్ ఎస్సై కొత్తూర్ విజయైపై అనిశా అధికారులు కేసు నమోదు చేశారు. ప్లాట్ల విక్రయం పేరిట చీటింగ్ చేశారన్న ఆరోపణలతో ఓ వ్యక్తిపై గతంలో కేసు నమోదైంది. అరెస్టు చేయకుండా ఉండాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని నిందితుడిని ఎస్సై విజయ్ కోరారు. ఇందుకు నిందితుడు ఒప్పుకోలేదు. తర్వాత అతడిని అరెస్టు చేశారు. అనంతరం అతడిని మరోసారి పిలిపించి.. పాత కేసులో అరెస్ట్ చేయకుండా ఉండాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని ఎస్సై కోరారు. నిందితుడు అనిశాను ఆశ్రయించారు. హైదరాబాద్ సిటీ డీఎస్సీ గంగస్వామి శ్రీధర్ బుధవారం ఎస్సై విజయ్న అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. “ఎస్సై విజయ్ ఈ నెల 2న చీటింగ్ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. కాగా, అదే నిందితుడిపై 2024లో మరో రెండు కేసులు ఉన్నాయి. అందులో ఓ కేసులో లంచం ఇచ్చేందుకు నిందితుడు సిద్ధపడటంతో ఎస్సై విజయ్ కి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు తనిఖీ చేశారు. ఆ తర్వాత డబ్బు తీసుకునేందుకు అంగీకరించలేదు. అయినా లంచం ఇవ్వాలని అడగటం కూడా నేరమే కావటంతో ఎన్సై విజయ్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేశాం’ అని డీఎస్సీ వివరించారు.

Related posts