SGSTV NEWS online
Crime

భర్త నిర్వాకం..స్నేహితులతో గడపాలంటూ భార్యపై ఒత్తిడి



హైదరాబాద్: వివాహితపై సామూహిక అత్యాచారానికి  పాల్పడిన ముగ్గురు నిందితులను కంచన్ బాగ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం… బాలాపూర్ రోషన్రెలా ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫయాజ్ (30) మయన్మార్కు చెందిన ఓ యువతిని (19)ని ఈ ఏడాది మే నెలలో వివాహం చేసుకున్నాడు. మద్యానికి బానిసైన మహ్మద్ ఫయాజ్ తన స్నేహితులను ఇంటికి తీసుకొచ్చి వారిని సైతం సుఖపెట్టాలని భార్యపై ఒత్తిడి చేసేవాడు.

ఈ క్రమంలో ఆమెను ఫయాజ్ స్నేహితులైన నూర్ కమల్(30), ముజీబ్(29), జియా ఉర్ రెహమాన్ ఆలియాస్ ఇబ్రహీం(30)లు ఆమెను ఇంట్లోనే నిర్బంధించి సామూహికంగా అత్యాచారానికి పాల్ప డ్డారు. ఈ క్రమంలో ఇంటి యజమాని కరెంటు బిల్లు, అద్దె నిమిత్తం ఇంటికి రాగా ఈ దారుణం బయటపడింది. ఈ మేరకు బాధితురాలు కంచన్ బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను భరోసా కేంద్రానికి పంపించి ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. ఫయాజ్ పరారీలో ఉన్నాడు.

Also read

Related posts