మెదక్ (నర్సాపూర్): అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో వ్యక్తి అత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని తిమ్మాపూర్ లో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ అమరేందర్‌రెడ్డి, మృతుని కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వెంకగోని నర్సింహాగౌడ్(45)కు భార్య సంతోష, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబంతో కలిసి గాగిల్ పూర్ కు వలసవెళ్లారు. అతను ప్రైవేటు కంపెనీలో డీసీఎం డ్రైవర్ గా పనిచేస్తుండగా, భార్య కూలీపనులు చేస్తుంది.
కాగా ఇద్దరు చెల్లెళ్ల పెళ్లికి, గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇంటికి అప్పులయ్యాయి. అప్పు ఎలా తీర్చాలని.. తన ఇద్దరు కూతుళ్ల పెళ్లి ఎలాచేయాలని బాధపడేవాడు. కాగా శనివారం ఉదయం గ్రామంలో పని ఉందని భార్యకు చెప్పి వచ్చాడు. అనంతరం తన ఫోన్ నుంచి ఇంటి ఫోన్ కు బాయ్ అమ్ములు అంటూ మెసేజ్ తో పాటు లొకేషన్ షేర్ చేశాడు. కాల్మీ అని మెసేజ్ చేసినా రిప్లే రాకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో విషయం గ్రామస్తులకు చెప్పారు. తిమ్మాపూర్దేట్ సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- వాటర్ హీటర్ తగిలి వివాహిత మృతి… విషాద ఘటన!
- అప్పుల బాధ తట్టుకోలేక.. కూతురికి లొకేషన్ షేర్ చేసి.!
- Mahanandi Temple: ఏపీలోని మహానంది ఆలయం దగ్గర అపచారం.. మాంసాహరం వండుకుని తిన్న యాత్రికులు.. వీడియో..
- Eagle Force: హైదరాబాద్ లొ ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
- Fake Bomb Threat Case:800 బాంబు బెదిరింపులు.. చివరకు చెన్నెలో చిక్కిన నిందితుడు!





