AP Mahanandi temple: మహానంది దేవస్థానం ఈవో కార్యాలయానికి దగ్గరలోనే కొంత మంది మాంసాహరం వండుకుని తినడం స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది. అధికారులు ఏంచేస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు.
ఇటీవల తరచుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు టార్గెట్ గా చేసుకుని కొంత మంది అపచారాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో అపవిత్రమైన పనులు చేస్తున్నారు. మొత్తంగా భక్తుల మనోభావాలు ఉద్దేష పూర్వకంగా దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. ఈ వరుస ఘటనలతో స్థానికంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పాడుతున్నాయి.ఈ క్రమంలో ఏపీలోని నంద్యాల జిల్లాలోని మహానంది ఆలయం పరిసరాల్లో కొంత మంది మాంసాహరం వండుకుని తినడం తీవ్ర వివాదస్పదంగా మారింది.
ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది ఆలయ పరిసరాల్లొ కొంత మంది యాత్రికులు మాంసాహారం వండుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా దేవస్థానం ఈవో ఆఫీసుకు కూత వేటు దూరంలో ఈ పనిచేసినట్లు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో అది కూడా పవిత్రమైన ఆలయ పరిసరాల్లో ఇంత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారని భక్తుల మండిపడుతున్నారు.ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై నంద్యాల మహానంది ఆలయ అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై స్థానిక భక్తులు, హిందు సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Also read
- వాటర్ హీటర్ తగిలి వివాహిత మృతి… విషాద ఘటన!
- అప్పుల బాధ తట్టుకోలేక.. కూతురికి లొకేషన్ షేర్ చేసి.!
- Mahanandi Temple: ఏపీలోని మహానంది ఆలయం దగ్గర అపచారం.. మాంసాహరం వండుకుని తిన్న యాత్రికులు.. వీడియో..
- Eagle Force: హైదరాబాద్ లొ ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
- Fake Bomb Threat Case:800 బాంబు బెదిరింపులు.. చివరకు చెన్నెలో చిక్కిన నిందితుడు!





