ఆశ్వాపురం: ప్రయాణికురాలితో చిల్లర కోసం జరిగిన గొడవ ఓ మహిళా కండక్టర్ ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. మిట్టగూడెంకు చెందిన ఓ ప్రయాణికురాలు.. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న మణుగూరు ఆర్టీసీ డిపోసకు చెందిన పల్లె వెలుగు బస్సు ఎక్కారు. ఆమెతో పాటు ఉన్న బాలుడికి టికెట్ తీసుకోవాలని మహిళా కండక్టర్ సూచించారు
అందుకు నిరాకరించిన ప్రయాణికురాలు.. కండక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం బాలుడికి టికెట్ తీసుకునేందుకు ఆంగీకరించిన ప్రయాణికురాలు కండక్టరు డబ్బులు ఇచ్చారు. టికెట్ ఇచ్చి దిగేటప్పుడు మిగిలిన చిల్లర తీసుకోవాలని కండక్టర్ చెప్పగా.. అలా కుదరదని, ఇప్పుడే చిల్లర ఇవ్వాలని ప్రయాణికురాలు వాగ్వాదానికి దిగారు. ఈలోగా మిట్టగూడెం స్టాప్ రాగానే ఆమె బస్సు దిగడానికి ప్రయత్నించారు. వాగ్వాదం నేపథ్యంలో మహిళా కండక్టర్ ఆమెను అదే బస్సులో అశ్వాపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. బస్సును ముందుకు నడపాలని డ్రైవర్‌కు సూచించారు. ఈ దశలో ఆ ప్రయాణికురాలు ఆమెను నెట్టివేయడంతో కదులుతున్న బస్సు వెనుక చక్రాల కింద పడిపోయారు. దీంతో ఆమె కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఆనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఎల్లయ్య తెలిపారు.
Also read
- తల్లి సంబంధాన్ని ప్రశ్నించిన కన్నకొడుకు.. కత్తి దాడిలో 21 ఏళ్ల యువకుడు మృతి!
- కన్నీటి విషాదం.. బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులుగా.. ఒకేసారి ముగ్గురి మృతి!
- చిల్లర కోసం గొడవ.. కదులుతున్న బస్సులోంచి కండక్టర్ ను తోసేసిన మహిళ…
- మ్యాట్రిమోనీ పరిచయం.. పెళ్లి పేరుతో మోసం..మహిళ నుంచి రూ.1.5 కోట్లకు పైగా వసూలు
- ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!





