SGSTV NEWS online
Astrology

నేటి జాతకములు 26 అక్టోబర్, 2026



మేషం (26 అక్టోబర్, 2026)

మీకు పన్నునొప్పికానీ పొట్ట అప్సెట్ అవడం కానీ ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. సత్వర బాధా నివృత్తికోసం ఒక డాక్టరును సంప్రదించండి. ఈరోజు దగ్గరిబంధువుల సహాయము వలన మీరు వ్యాపారము బాగా చేస్తారు.ఇదిమీకు ఆర్ధికంగా కూడా అనుకూలిస్తుంది. ఆర్థిక సంబంధమయిన విషయాలకు సంబంధించి, మీకుతెలిసిన ఒకరు అతిగా స్పందించి, ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్ గా అందరికీ చెప్పెస్తే, మీ ప్రాజెక్ట్ నాశనమైపోతుంది. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది.రోజు గడిచేకొద్దీ మీరు మంచిఫలితాలను పొందుతారు.రోజు చివర్లో, మీరు మీకొరకు సమయాన్ని కేటాయిస్తారు.ఈసమయాన్ని మీరు మీకు బాగా దగ్గరివారిని కలవడానికి వినియోగిస్తారు. మీ జీవిత సర్వస్వమైన మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకో అద్భుతమైన సర్ ప్రైజ్ ఇవ్వవచ్చు.

లక్కీ సంఖ్య: 4

వృషభం (26 అక్టోబర్, 2026)

జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్)పొందుతారు. తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమయిన అన్ని కోణాలలోంచి, పెట్టుబడులని పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు. కుటుంబసభ్యుల మధ్య డబ్బుసంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును.మీరు కుటుంబసభ్యలకి ఆర్ధికవిహాయల్లో,రాబడిలో దాపరికంలేకుండా ఉండాలి అని చెప్పండి. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్దికాలమే. అల్లం, గులాబీలతో కూడిన చాక్లెట్ ను ఎప్పుడైనా రుచి చూశారా? మీ ప్రేమ జీవితం ఈ ర ఓజు మీకు అలాంటి రుచిని చవిచూపనుంది. ప్రయాణం ఖర్చుదారీ పని కానీ, ప్రయోజన కరమే. అపార్థాలమయంగా సాగిన దుర్దశ తర్వాత ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమానందపు మత్తులో పూర్తిగా మునిగిపోతారు.

లక్కీ సంఖ్య: 4

వృషభం (26 అక్టోబర్, 2026)

జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్)పొందుతారు. తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమయిన అన్ని కోణాలలోంచి, పెట్టుబడులని పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు. కుటుంబసభ్యుల మధ్య డబ్బుసంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును.మీరు కుటుంబసభ్యలకి ఆర్ధికవిహాయల్లో,రాబడిలో దాపరికంలేకుండా ఉండాలి అని చెప్పండి. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్దికాలమే. అల్లం, గులాబీలతో కూడిన చాక్లెట్ ను ఎప్పుడైనా రుచి చూశారా? మీ ప్రేమ జీవితం ఈ ర ఓజు మీకు అలాంటి రుచిని చవిచూపనుంది. ప్రయాణం ఖర్చుదారీ పని కానీ, ప్రయోజన కరమే. అపార్థాలమయంగా సాగిన దుర్దశ తర్వాత ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమానందపు మత్తులో పూర్తిగా మునిగిపోతారు.

లక్కీ సంఖ్య: 4

కర్కాటకం (26 అక్టోబర్, 2026)

అనుకోని ప్రయాణం బాగా అలసటగా ఉంటుంది, మిమ్మల్ని చీకాకుపరుస్తాయి, మీకండరాలకు నూనెతో మర్దనా చేస్తే కొంత రిలీఫ్ వస్తుంది. పెట్టుబడి పథకాలవిషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకొండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయేముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. పిల్లలకు చదువుపట్ల శ్రద్ధ లేనందువలన, బడిలో మాటపడి కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. బిజినెస్ మీటింగులలో ముక్కుసూటిగా మాటాడడం, భావోద్వేగాలకు లోనుకావడం వంటివి చేయకండి. అవి మీరు అదుపు చేయలేకపోతే, మీ ప్రతిష్టని దెబ్బతీస్తాయి. సమయము ఎంతదుర్లభమైనదో తెలుసుకొని,దానినిఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు.ఇది మీకు ఆర్ధికంగా బాగా కలిసివస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత స్పెషల్ ది ఒకటి కొనిస్తారు.

లక్కీ సంఖ్య: 5

సింహం (26 అక్టోబర్, 2026)

ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే క్రుంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచితెలిసినట్లు, కొంత విచారం ఉండడం అవసరం. అలాగ ఉన్నప్పుడే, మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయి మీ మూడ్ ని మార్చుకొండి. ఇతరులను మురిపించాలని మరీఎక్కువగా దూబరా ఖర్చు పెట్టకండి. మీ ఇంటివాతావరణం కొంతవరకు ఊహకి అందని అన్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. తమకు ప్రియమైన వారితో కొద్దిరోజుల శెలవుపై ఉన్నవారికి బోలెడంత మరపురాని మధుర సమయాన్ని గడప గలుగుతారు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతోంది. దాన్ని అనుభూతి చెందండి. ఈరాశికి చెందినపెద్దవారు వారి ఖాళీసమయాల్లో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే, పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసిరానుంది.

లక్కీ సంఖ్య: 3

కన్య (26 అక్టోబర్, 2026)

విచారాన్ని తరిమెయ్యండి- అది మిమ్మల్ని ఆవరించి, మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఊహలదారులవెంట పరులెత్తకండి. వాస్తవంలో బ్రతకడానికి మరింతగా ప్రయత్నించండి. మీస్నేహితులతో మరింత సమయం గడపండి- అది కొంత మేలు చేకూరుస్తుంది. మీకు ప్రియమైన వ్యక్తి/ మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు, వారి కళను ప్రదర్శించడానికి, ఎన్నెన్నో క్రొత్త అవకాశాలు వస్తాయి. సమయము ఎల్లపుడు పరిగెడుతూవుంటుంది.కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు.

లక్కీ సంఖ్య: 2

తుల (26 అక్టోబర్, 2026)

మీరు భయం అనే భయంకరమైన రాక్షసునితో పోరాడుతున్నారు. మీ ఆలోచనలను సానుకూలంగా మలచుకొండి. లేకపోతే మీరు ఆరాక్షసుని వద్ద మిన్నకుండిపోయి దానిని ఎదురుచెప్పక లొంగిపోతారు. ఉద్యోగస్తులు ఒకస్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు,కానీ ఇదివరకుపెట్టిన అనవసరపు ఖర్చులవలన మీరు వాటిని పొందలేరు. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోను, ప్రముఖులతోను పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఉత్తరప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూపోతే విజయం మీదే. ఈ రోజు, మీరు మీ మేధ కు పదును పెడతారు- చదరంగం- గడినుడి వంటి పజిల్ లు ఆడితే, కొందరు, కథ – కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.

లక్కీ సంఖ్య: 4

వృశ్చిక (26 అక్టోబర్, 2026)

మీగురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు. చాలారోజులుగా రుణాలకోసము ప్రయత్నిస్తున్నమీకు ఈరోజు బాగా కలిసివస్తుంది ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన చిన్న ట్రిప్, మీ బిజీ ప్రణాళికనుండి, చక్కని విశ్రాంతిని, సౌకరాన్ని కలిగించి, రిలాక్స్ చేస్తుంది. ప్రతిరోజూ ప్రేమలో పడడం అనే స్వభావాన్ని మార్చుకొండి. ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం, ప్రమాణ పూర్వకమైనది. అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకూ అసాధ్యమేమీ లేదు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు. దాంతో ఆమె/అతను మీతో గొడవ పడతారు.

లక్కీ సంఖ్య: 6

ధనుస్సు (26 అక్టోబర్, 2026)

మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో- లేదా రాత్రి డిన్నర్ లోనో కలిసి ఉండడం అనేది, మిమ్మల్ని, మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి, అద్భుతమయిన మూడ్ ని రప్పించగలదు. మీ సృజనాత్మకత నైపుణ్యాలు,సరియైన వాడుకలో ఉంచగలిగితే, ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడి నిస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలో మీ స్నేహితులు అవసరాన్ని మించి జోక్యం చేసుకుంటారు. భావోద్వేగాలు మిమ్మల్ని చీకాకు పెడతాయి. మీ ఆలోచనా రీతిలో విశ్వసనీయతను సూటిఅయిన దృక్పథాన్ని కలిగి ఉండండి- మీ స్థిరనిశ్చయం, మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి ప్రేమవ్యవహారాలలో మాటపదిలంగా వాడండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు

లక్కీ సంఖ్య: 3

మకరం (26 అక్టోబర్, 2026)

ఒక స్నేహితుని నుండి అందిన ప్రశంస మీకు ఆనందదాయకం కాగలదు. తాము సూర్యుని వేడిమిని భరిస్తూకూడా, ఇతరులకి నీడనిచ్చే వృక్షాల లాగ, మీరు మీ జీవితాన్ని,మలుచుకున్నారు కనుక ఈ మెప్పు లభించింది. ఈరోజు ఇంటిపెద్దవారి నుండి డబ్బులుఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చుపెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. సాధారణ పరిచయస్థులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. మీ ప్రియమైన వారి బాహుబంధంలో సంతోషన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా, అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకున్నరుగా, ఇంకే- మీ పని హాయిగా విశ్రాంతిగా వెనసీటుకి చేరుతుంది- మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ఓ అందమైన దానితో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు. ఈరోజు చాలా బాగుంటుంది.మీకొరకు మీరుబయటకువెళ్లి ఆహ్లాదంగా గడపండి.దీనివలన మీ వ్యక్తిత్వములో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. వైవాహిక జీవితం విషయంలో ఈ రోజు అన్ని విషయాలూ చాలా ఆనందంగా గడుస్తాయి.

లక్కీ సంఖ్య: 3

కుంభం (26 అక్టోబర్, 2026)

గర్భవతి అయిన స్త్రీ, లేదా కాబోయే తల్లి, గచ్చుమీద నడిచే సమయంలో జాగ్రత్త వహించాలి. ఇంకా పొగత్రాగే స్నేహితుల ప్రక్కన నిలబడవద్దు. ఇంకా జన్మించని ఆ శిశువుపై దీని చెడు ప్రభావం పడగలదు. ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చుచేస్తారో,వారికి అత్యవసర సమయాల్లో ఎంతవరసరమో తెలిసివస్తుంది. ఆలస్యంగానైనా మీ వ్యక్తిగత జీవితం మీకు పట్టించుకోవలసిన పెద్ద విషయం అయింది.- కానీ ఈ రోజు మీరు సామాజిక పనులపై దృష్టి పెడతారు- మిమ్మల్ని సమస్యలతో కలిసిన వారిపట్ల ఉదారత మరియు సహాయం ప్రకటిస్తారు. ప్రేమైక జీవితం ఆశను తెస్తుంది. ఎవరైతే ఇంకాఉద్యోగమూరాకుండాఉన్నారోవారు ఈరోజు కష్టపడితేవారికి తప్పకుండా మంచి ఉద్యోగము వస్తుంది.కష్టపడితేనే మీకు ఫలితము ఉంటుంది. ఈరోజు మీ చుట్టాల్లో ఒకరు మీకుచెప్పకుండా మీఇంటికి వస్తారు.మీరు వారియొక్క అవసరాలు తీర్చుటకు మిసమయాన్ని వినియోగిస్తారు. వైవాహిక జీవితపు మధురిమను ఈ రో జు మీరు రెండు చేతులా గ్రోలుతారు.

లక్కీ సంఖ్య: 1

మీన (26 అక్టోబర్, 2026)

మీ నమ్మకం, మరియు శక్తి, ఈరోజు బాగా ఎక్కువ ఉంటాయి. ఈరోజు,మీబంధువులలో ఎవరైతే మీదగ్గర అప్పుతీసుకుని తిరిగి చెల్లించకుండా మల్లిఅడుగుతారో వారికి అప్పుఇవ్వకండి. మనుషులు మీకు బోలెడు ఆశలు కలలు కలిగించవచ్చును- కానీ మీ పరిశ్రమ పైనే అంతా ఆధారపడి ఉంటుంది. మీరు ఒంటరిగా ఉండీ, తోడు లేకపోవడంతో, మీ చిరుమందహాసాలకు అర్థంలేదు- నవ్వులకు శబ్దం రాదు, హృదయం కొట్టుకోవడం మరిచిపోతుంది కదా! మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో ,సమయాన్ని ఎలాసద్వినియోగించుకోవాలో తెలుసుకోండి.ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులను చేస్తారు. మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్ గా సాగుతోందని మీకు తెలిసొస్తుంది. కాస్త ఎక్సైట్ మెంట్ కోసం ప్రయత్నించండి.

లక్కీ సంఖ్య: 7



గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Also read

Related posts