హైదరాబాద్ సోమాజిగూడలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అర్థరాత్రి బార్‌లో ఓ వ్యక్తి గన్‌తో హల్చల్ చేశాడు. తాను బార్‌లో చెల్లించిన బిల్లును తిరిగి ఇవ్వాలని లేదంటే కాల్చేస్తానని, బార్ సిబ్బందితో పాటు కస్టమర్లను బెదిరించాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
సోమాజిగూడలోని ఓ ప్రముఖ బార్ అండ్ రెస్టారెంట్‌లో రివాల్వర్‌తో ఓ వ్యక్తి హల్‌చల్ చేయడం తీవ్ర కలకలం రేపింది. బిల్లు చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే కాల్చి చంపుతానంటూ బౌన్సర్లు, కస్టమర్లను సదరు వ్యక్తి బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. బార్ సిబ్బంది ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదురు వ్యక్తిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 12:30 గంటల సమయంలో సోమాజీగూడలోని హెడ్‌క్వార్టర్స్ బార్ అండ్ రెస్టారెంట్ రెండో అంతస్తులో కొందరు కస్టమర్ల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది జోక్యం చేసుకుని ఇరువర్గాలను బయటకు పంపించేశారు. అనంతరం వారిలో మహమ్మద్ షానవాజ్ అనే వ్యక్తి సెల్లార్‌లో పార్క్ చేసి ఉన్న మహీంద్రా థార్ వాహనం వద్దకు వెళ్లి అందులో ఉన్న రివాల్వర్ తీసుకుని తిరిగి రెస్టారెంట్‌లోకి ప్రవేశించేందుకు యత్నించాడు.
గ్రౌండ్ ఫ్లోర్‌లో విధులు నిర్వర్తిస్తున్న బౌన్సర్ గణేశ్ అతడిని అడ్డుకుని సెల్లార్ వైపు తీసుకెళ్లాడు. అయితే ఇతర కస్టమర్ల వెంట మళ్లీ సెల్లార్‌లోకి ప్రవేశించిన షానవాజ్.. చేతిలోని రివాల్వర్ చూపిస్తూ సిబ్బందితో పాటు కస్టమర్లను తీవ్రంగా బెదిరించాడు. తాను బిల్లు కోసం చెల్లించిన డబ్బులను వెంటనే తిరిగి ఇవ్వకపోతే కాల్చి చంపేస్తానని హెచ్చరించడంతో అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు.
పోలీసుల అదుపులో నిందితుడు
ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు మహమ్మద్ షానవాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రివాల్వర్‌ను స్వాధీనం చేసుకుని, మహీంద్రా థార్ వాహనంతో పాటు అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై బార్ బౌన్సర్ బచ్చు బంటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, చట్టప్రకారం తదుపరి చర్యలు చేపడుతున్నారు.
Also read
- కార్తీక మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది, తులసి పూజ ఎందుకు చేయాలి? లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం ఇలా చేయండి!
- శ్రీకృష్ణుడి విశ్వరూపం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. వేయి తలలు, కళ్లు అంటే అర్థం ఏమిటో తెలుసా?
- మరణించిన వారి ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారు? దీని వెనుక అసలు కారణం ఇదే!
- Diwali 2026: రాసిపెట్టుకోండి..దీపావళి నుంచి నక్కతోక తొక్కే రాశులివే..!
- నేటి జాతకములు 26 అక్టోబర్, 2026





