SGSTV NEWS online
Andhra PradeshCrime

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఆగని విషాదాలు.. తల్లితోపాటు గర్భంలోనే తనువుచాలించిన కవలలు



పేదలకు పెద్దు దిక్కుగా నిలవాల్సిన ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి విషాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే హాస్పిటల్‌లో సుమారు ఐదుగురు నవ జాతిశిశువులు, ఓ గర్బిణీ మృతి చెందారు. ఈ వరుస మరణాలు రోగుల్లో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.


ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్‌ హాస్పిటల్‌ వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవలే హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం జరిగిన ఐదుగురు నవజాత శిశువు మరణించగా తాజాగా చికిత్స కోసం హాస్పిటల్‌కు వచ్చిన ఓ గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఉట్నూరుకు చెందిన ఏడు నెలల గర్భిణీ అయిన బి.సునీత కాళ్ల వాపులతో ఈ నెల 21న ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చేరింది. అయితే చికిత్స పొందుతున్న సమయంలో బీపీ పెరగడంతో తీవ్ర అస్వస్థకు గురై ఆమె మృతి చెందింది. తల్లి మృతి చెందడంతో కడుపులో ఉన్న ఇద్దరు కవల పిల్లలు సైతం పుట్టక ముందే తల్లి గర్బంలోనే ప్రాణాలు కోల్పోయారు.


అయితే గర్బిని సునీత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నట్లు సమాచారం. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమెకు అందించిన చికిత్స, ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించిన తీరుపై అనుమానాలు ఉన్నాయని.. ఘటనపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి, సునీత మృతికి గల కారణాలను వెల్లడించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.


ఇదిలా ఉండగా గత సెప్టెంబరు 21 న అర్థరాత్రి‌ అగ్నిప్రమాదం చోటు చేసుకుని ఐదుగురు నవజాత శిశువులు చనిపోయారు. రిమ్స్ ఆస్పత్రిలోని నవజాత శిశువుల ప్రత్యేక రక్షణ వార్డులో (SNCU ) షార్ట్ సర్క్యూ ట్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈఘటన మరువక ముందే మరోసారి గర్బిని, తల్లి కడుపులో కవలలు మృతి చెందడం రిమ్స్ హాస్పిటల్ సిబ్బంది, వైద్యుల తీరును కల్లకు కడుతోంది.

Also read

Related posts