దేవీ శరన్నవరాత్రుల వేళ ఆదివారం రోజున మనం దుర్గష్టమిని జరుపుకుంటాం. ఈక్రమంలో అష్టమి తిథి ఉదయం 9 తర్వాత ప్రారంభం కావడంతో వల్ల ఈరోజు కూడా కొంత మంది పూజలు, రెమిడీలు పాటిస్తారు. దీని ప్రభావం వల్ల ద్వాదశ రాశులపై ఉంటుంది.
దేశ వ్యాప్తంగా దుర్గమ్మ నవరాత్రులను భక్తి, భావనలతో జరుపుకుంటున్నారు. ఈక్రమంలో దేవీ శరన్నవరాత్రుల వేళ మనం ఆదివారం రోజున అష్టమిని జరుపుకుంటాం. ఆదివారం రోజున అష్టమి తిథి కలిసి రావడంను చాలా శక్తివంతంగా చెబుతుంటారు. ఈ రోజున చేసే పూజలు, వ్రతాలు గొప్ప లాభాలను ఇస్తాయి. అందుకే అక్టోబర్ 18 వతేదీన ఆదివారం రోజున ఉదయం తర్వాత అష్టమి తిథివస్తుంది. ఈ క్రమంలో అష్టమివేళ దుర్గమ్మ ఆరాధన, లలిత సహస్రనామా పారాయణం వంటి స్తోత్రాలు పఠిస్తే జీవితంలోని అన్ని సమస్యలు దూరమౌతాయిన జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా దుర్గా ష్టమి వేళ అరుదైన గజకేసరి యోగం కూడా ఏర్పడుతుంది. ఇది అత్యంత శక్తివంతమైనదని పండితులు చెబుతున్నారు. దీంతో కొన్ని రాశుల జీవితాల్లో ఊహించని అద్బుతాలుజరుగుతాయి .ఆ రాశులు ఏంటో చూద్దాం.
మేషం.. ఈ రాశుల వారికి దుర్గష్టమి వేళ ఆర్థిక లావాదేవీలు లాభాస్తాయి. కోర్టు కేసుల్లో విజయాలను సాధిస్తారు. విదేశీయానంకు ఇది మంచి అవకాశం. సంఘంలో పేరు, ప్రఖ్యాదులున్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. రాదనుకున్న డబ్బులు మీ సొంతమౌతాయి.
మిథునం.. ఈ రాశుల వారికి కోరుకున్న అమ్మాయితో పెళ్లి యోగం కన్పిస్తుంది. లాటరీలు తగులుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. రాజకీయాల్లో కీలక పదవులను సొంతం చేసుకుంటారు. మీకు సన్నిహితులు, బంధువులతో కలిసి ధన సాయం చేస్తారు.
తుల.. ఈ రాశుల వారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తండ్రి, భార్యవైపు ఆస్తులు మీ సొంతమౌతాయి. కోర్టు కేసుల్లో విజయాలను సాధిస్తారు. ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో భారీగా లాభాలను సొంతం చేసుకుంటారు. ఆన్ లైన్ లో ట్రెడింగ్ లో పెట్టే పెట్టుబడిలో భారీగా లాభాలు వస్తాయి.
ధనస్సు.. ఈ రాశుల వారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాల్లో స్థాన చలనం, ప్రమోషన్లు కన్పిస్తున్నాయి. పేరు, ప్రఖ్యాదులు పెరుగుతాయి. ఆగిపోయిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
