ULC Fraud: నకిలీ అర్బన్ ల్యాండ్ సీలింగ్
(యూఎల్సీ) క్లియరెన్స్ లేఖలతో ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించిన కేసులో ముగ్గురిని సూరారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జీడిమెట్ల గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 192, 193లో ఉన్న ప్లాట్లకు సంబంధించి నకిలీ యూఎల్సీ క్లియరెన్స్ లేఖలను కుత్బుల్లాపూర్ సబ్డిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించారు. వీటి ఆధారంగా ఈ ఏడాది జూన్ 4న రెండు సేల్ డీడ్లు రిజిస్ట్రేషన్ చేశారు.
నకిలీ పత్రాలు తయారీ..
అనంతరం పత్రాల ప్రామాణికతను పరిశీలించగా అవి నకిలీవని తేలింది. ఈ వ్యవహారంలో జాదవ్ సుధాకర్ (39), నారాయణదాసు శివాచారి అలియాస్ శివ (57), చిట్టిమిల్ల బాలరాం (64)లను పోలీసులు అరెస్టు చేశారు. యూఎల్సీ క్లియరెన్స్ ఇప్పిస్తామని నమ్మించి, ప్రభుత్వ అధికారుల సంతకాలు, ముద్రలను అనుకరిస్తూ నకిలీ పత్రాలు తయారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం రూ.6 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మరెవరైనా ఉన్నారా..
నిందితుల నుంచి 17 పత్రాలు, ఐదు రబ్బరు స్టాంపులు, ఐదు స్టాంప్ ప్యాడ్లు, గ్రీన్ పెన్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా ? ఇతర ఆస్తులకూ నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు జరిగాయా ? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటి రెడ్డి పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది.
Also read
- నకిలీ యూఎల్సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం
- షుగర్ వ్యాధి ముదిరింది.. పదే, పదే మూత్ర విసర్జన, ఆ సమయంలో నొప్పి.. తట్టుకోలేక
- నవరాత్రి : దుర్గాదేవి సింహంపై ఎందుకు స్వారీ చేస్తుంది? మహిషాసురుడి యుద్ధం వెనుక రహస్యం ఇదే!
- నవరాత్రి : దుర్గాపూజలో అరటిచెట్టుకు పెళ్లికూతురిలా అలంకారం.. కోలాబౌ వెనుక ఉన్న రహస్యం ఇదే!
- దుర్గాదేవి చేతిలోని దివ్య ఆయుధాల వెనుక రహస్యం ఇదే.. ఒక్కో ఆయుధం ప్రత్యేకత తెలుసా?





