Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా బుధవారం ఈడీ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని విచారిస్తుంది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా బుధవారం ఈడీ వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని విచారిస్తోంది. ఈ హత్య కేసులో రూ.40 కోట్ల సుపారీ వ్యవహారంపై ఆరా తీస్తోంది. మనీలాండరింగ్ కోణంలో ఆర్థిక లావాదేవీల పైనా ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. హత్యకు ముందు, తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కేసులో నిందితులు, సంబంధిత వ్యక్తుల ఆర్థిక లావాదేవీల వివరాలను ఈడీ సేకరిస్తోంది.
ఇప్పటికే వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది. ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి లావాదేవీలపైనా వివరాల సేకరించింది. సుపారీ చెల్లింపులు, నిధుల మూలాలు, నగదు బదిలీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. మనీ ట్రయిల్‌పై సునీల్ యాదవ్, దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అవినాష్‌రెడ్డిని ప్రశ్నించే అవకాశముంది. ఆర్థిక లావాదేవీల ఆధారంగా మనీలాండరింగ్ కోణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ ఏడాది ఆగస్టులో 21 అవినాష్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ లెక్కల్లో చూపని రూ.24 లక్షల నగదు, రెండు బ్యాంకు లాకర్ తాళాలు, కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. ఆరుగురు నిందితుల విచారణ సహా ఇంట్లో దొరికిన కీలక డాక్యుమెంట్ల ఆధారంగా ఏ8 అవినాష్ రెడ్డిని ఈడీ విచారిస్తుంది
Also read
- వివేకా హత్య కేసు – ఈడీ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
- మద్యం రవాణా కుంభకోణం అప్డేట్స్ – కారుమూరి సునీల్‌ను విచారిస్తున్న సిట్
- అంకిత భండారి హత్య కేసు – ఆమె కుటుంబం CBI విచారణ కోరుతోంది
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Vijayawada Drugs:బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!



