తెలుగు పంచాంగం ప్రకారం ఏడో మాసమైన ఆశ్వయుజం శక్తి ఆరాధన, నవరాత్రులు, విజయదశమి వంటి పర్వదినాలకు ప్రత్యేకం. ఆశ్వయుజ మాసం ముగిసిన అనంతరం నవంబర్ 10 నుంచి కార్తిక మాసం ప్రారంభం అవుతుంది.
Ashwayuja Masam 2026 Festivals : తెలుగు పంచాంగం ప్రకారం ఏడో మాసం ఆశ్వయుజ మాసం! శక్తి ఆరాధనకు విశిష్టమైన ఆశ్వయుజ మాసం- పవిత్ర ఆశ్వయుజ మాసంలో ఓ వైపు దేవి నవరాత్రులు, మరోవైపు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు!
శక్తి మాసం
తెలుగు మాసాల్లో ఆశ్వయుజ మాసం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత సంతరించుకుంది. శక్తి మాసంగా పేరొందిన ఈ మాసంలో శుక్లపక్షం పాడ్యమి నుంచి దశమి వరకు శరన్నవరాత్రుల పేరిట దేవి ఆరాధన విశేషంగా జరుగుతుంది. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమల కొండపై శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. బతుకమ్మ పండుగ, మూలా నక్షత్రం, విజయదశమి వంటి ఎన్నో పర్వదినాలు ఇదే మాసంలో వస్తాయి. ఇవే కాకుండా ఆశ్వయుజ మాసంలో ఇంకా ఎలాంటి పర్వదినాలు, పుణ్య తిథులు రానున్నాయి చూద్దాం.
ఆశ్వయుజ మాసంలో పర్వదినాలు- పుణ్య తిథులు
👉 అక్టోబర్ 11, ఆదివారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి ఆశ్వయుజ మాసం ప్రారంభం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు కలశ స్థాపన, శ్రీ బాలా త్రిపురసుందరీ దేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
👉 అక్టోబర్ 12, సోమవారం ఆశ్వయుజ శుద్ధ విదియ
చంద్రోదయం, తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు ప్రారంభం, పెద్ద శేష వాహనం, ఇంద్రకీలాద్రిపై శ్రీ గాయత్రి దేవి అలంకారంలో అనుగ్రహించనున్న దుర్గమ్మ
👉 అక్టోబర్ 13, మంగళవారం ఆశ్వయుజ శుద్ధ తదియ
ఇంద్రకీలాద్రిపై శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారంలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ
👉 అక్టోబర్ 14, బుధవారం ఆశ్వయుజ శుద్ధ చవితి
శ్రీ మహా చండీ దేవి అలంకారంలో అనుగ్రహించనున్న దుర్గమ్మ
👉 అక్టోబర్ 15, గురువారం ఆశ్వయుజ శుద్ధ పంచమి
లలితా పంచమి, శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో దర్శనమివ్వనున్న కనకదుర్గమ్మ
👉 అక్టోబర్ 16, శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ షష్టి
తిరుమల శ్రీవారి గరుడోత్సవం
👉 అక్టోబర్ 17, శనివారం ఆశ్వయుజ శుద్ధ సప్తమి
తిరుమల శ్రీవారి పుష్పక విమానం, దేవి త్రిరాత్ర వ్రతం మూలా నక్షత్రం, సరస్వతి పూజ, బాసరలో అక్షరాభ్యాసాలు, సరస్వతి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్న కనకదుర్గమ్మ
👉 అక్టోబర్ 18, ఆదివారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి
దుర్గాష్టమి, దుర్గాదేవిగా దర్శనమివ్వనున్న కనకదుర్గమ్మ, తులా సంక్రమణం, సద్దుల బతుకమ్మ పండుగ
👉 అక్టోబర్ 19, సోమవారం ఆశ్వయుజ శుద్ధ నవమి
మహర్నవమి: మహిషాసుర మర్దినిగా దర్శనమివ్వనున్న కనకదుర్గమ్మ, శుక్ర మౌడ్యం ఆరంభం, తిరుమల శ్రీవారి స్వర్ణరథోత్సవం
👉 అక్టోబర్ 20, మంగళవారం ఆశ్వయుజ శుద్ధ దశమి
విజయదశమి, తిరుమల శ్రీవారి చక్రస్నానం, అపరాజితాదేవి జయంతి, శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ, శమీపూజ, షిర్డీ సాయి సమాధి ఉత్సవం
👉 అక్టోబర్ 22, గురువారం ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి
మతత్రయ ఏకాదశి
👉 అక్టోబర్ 23, శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి/ త్రయోదశి
పద్మనాభ ద్వాదశి, పక్ష ప్రదోషం
👉 అక్టోబర్ 25, ఆదివారం ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి
సువర్ణముఖి తీర్థ ముక్కోటి, తిరుమల శ్రీవారి పున్నమి గరుడసేవ
👉 అక్టోబర్ 26, సోమవారం ఆశ్వయుజ పౌర్ణమి
వాల్మీకి మహర్షి జయంతి
👉 అక్టోబర్ 27, మంగళవారం ఆశ్వయుజ బహుళ పాడ్యమి
విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర
👉 అక్టోబర్ 28, బుధవారం ఆశ్వయుజ బహుళ విదియ/ తదియ
చంద్రోదయ ఉమావ్రతం, అట్లతద్ది
👉 అక్టోబర్ 29, గురువారం ఆశ్వయుజ బహుళ చవితి
సంకష్టహర చతుర్థి, శుక్ర మౌడ్యం త్యాగం
👉 నవంబర్ 2, సోమవారం ఆశ్వయుజ బహుళ అష్టమి
తిరుమలనంబి ఉత్సావారంభం
👉 నవంబర్ 5, గురువారం ఆశ్వయుజ బహుళ ఏకాదశి
మతత్రయ ఏకాదశి
👉 నవంబర్ 6, శుక్రవారం ఆశ్వయుజ బహుళ ద్వాదశి/ త్రయోదశి
పక్ష ప్రదోషం, ధంతేరస్ ధన త్రయోదశి
👉 నవంబర్ 7, శనివారం ఆశ్వయుజ బహుళ త్రయోదశి/ చతుర్దశి
మాసశివరాత్రి
👉 నవంబర్ 8, ఆదివారం ఆశ్వయుజ బహుళ చతుర్దశి/ అమావాస్య
నరక చతుర్దశి/ దీపావళి అమావాస్య, ధనలక్ష్మి పూజ
👉 నవంబర్ 9, సోమవారం ఆశ్వయుజ బహుళ అమావాస్య మిగులు
కేదార గౌరీ వ్రతం, ఆకాశదీపారంభం, ఈ రోజుతో ఆశ్వయుజ మాసం సమాప్తమవుతుంది. మరుసటి రోజు నుంచి పరమ పవిత్రమైన కార్తిక మాసం ప్రారంభం అవుతుంది. పవిత్రమైన ఈ ఆశ్వయుజ మాసంలో విశేషమైన పర్వదినాలను, పుణ్య తిథులను శాస్త్రంలో సూచించిన విధంగా ఆచరిద్దాం! సకల శుభాలు పొందుదాం.
శుభం భూయాత్!
