Mahalaya Amavasya 2026: మహాలయ అమావాస్య రోజున కాకులకు ఆహారం సమర్పించే విధానం, ఈ ఆచారం వల్ల కలిగే సాంప్రదాయ ప్రయోజనాల గురించిన సమాచారం.
Mahalaya Amavasya 2026: హిందూ ధర్మంలో మహాలయ అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకోవడం, పూజించడం అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా పూర్వీకులకు గౌరవసూచకంగా కాకులకు ఆహారం పెట్టడం అనేది ఆచారాలలో ఒకటి. ఈ సంవత్సరం మహాలయ అమావాస్య అక్టోబర్ 10న వస్తుంది.
ఆ రోజున మీరు తాజాగా వండిన అన్నంలో నల్ల నువ్వులు, ఆవు నెయ్యి, బెల్లం (లేదా ముడి చెరకు చక్కెర) కలిపి, ఆ మిశ్రమంతో చిన్న ఉండలు చేసి కాకులకు ఆహారంగా పెట్టవచ్చు. ఈ నైవేద్యాన్ని ఇంటి పైకప్పు మీద లేదా బయట ఏదైనా శుభ్రమైన ప్రదేశంలో ఉంచవచ్చు.
ఆ రోజున మీరు తాజాగా వండిన అన్నంలో నల్ల నువ్వులు, ఆవు నెయ్యి, బెల్లం (లేదా ముడి చెరకు చక్కెర) కలిపి, ఆ మిశ్రమంతో చిన్న ఉండలు చేసి కాకులకు ఆహారంగా పెట్టవచ్చు. ఈ నైవేద్యాన్ని ఇంటి పైకప్పు మీద లేదా బయట ఏదైనా శుభ్రమైన ప్రదేశంలో ఉంచవచ్చు.
అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో ముఖ్యంగా ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల మధ్య కాకులకు ఆహారం పెట్టడం ఆచారంగా వస్తోంది. ఆహారాన్ని సమర్పించేటప్పుడు పూర్వీకులను మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ వారి ఆశీర్వాదాల కోసం ప్రార్థించడం ఒక సంప్రదాయం.
కాకులకు ఆహారం పెట్టడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని , వారి శాపం తొలగిపోతుందని ఒక సంప్రదాయ విశ్వాసం ఉంది. అంతేకాకుండా ఈ ఆచారం కుటుంబానికి ఎదురయ్యే అడ్డంకులను (వివాహ సంబంధిత ఆటంకాలతో సహా) తొలగించి ఇంట్లో సంతోషం, ప్రశాంతమైన వాతావరణాన్ని పెంపొందిస్తుందని నమ్ముతారు.
భాద్రపద మాసం శుక్ల పక్షంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకూ… ప్రతి సంవత్సరం ఈ పదిహేను రోజులను ‘మహాలయ పక్షం’ లేదా ‘పితృపక్షం’ అని పిలుస్తారు. పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు నిర్వహించడానికి తద్వారా వారిని తలచుకోవడానికి పూర్వులు నిర్దేశించిన పుణ్యకాలం ఇది.
ఈ పక్షంలో ఆఖరి రోజైన అమావాస్యను ‘మహాలయ అమావాస్య’, ‘సర్వపితృ అమావాస్య’ అంటారు.అదేవిధంగా దీనివల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సౌభాగ్యం వెల్లివిరుస్తుందని నమ్ముతారు. కుటుంబ శ్రేయస్సు కోసం మహాలయ అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకుంటూ వారికి నిరాడంబరంగా ఆహారాన్ని సమర్పించి పూజించడం అనేది ఒక సంప్రదాయ ఆచారంగా కొనసాగుతోంది.
