SGSTV NEWS online
Andhra Pradesh

క్వారీల్లో  నక్కిన పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా గాలింపు

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం మేరీ మాత ఆలయం సమీపంలోని క్వారీల్లో  నక్కిన పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పులి మెడకు ఉన్న జీపిస్ ట్రాకర్స సహాయంతో  ఎప్పటికప్పుడు పులి కదలికలను గమనిస్తున్నారు.

పెద్దపులిని సురక్షితంగా పట్టుకునేందుకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సమీపంలోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ, ఇతర శాఖల అధికారులు సూచించారు. ముఖ్యంగా క్వారీలు, పొలాలు, అటవీ ప్రాంతాల సమీపంలోకి వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని, తగు జాగ్రత్తలు పాటించాలని మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం సీతానగరం మండలం నుంచి గోదావరి దాటి ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి.

ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆదేశాల మేరకు క్వారీ, క్రషర్స్ యూనియన్ అధ్యక్షులు, సొసైటీ చైర్మన్ ఆండ్రు అనిల్  పులి సంచరిస్తున్న ప్రాంతానికి వచ్చి అటవీ శాఖ అధికారులతో మాట్లాడి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

బోను, యాంటీనా ద్వారా జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకర్టై, రేంజ్ అధికారి దావీదు , RRR, ఆటవీశాఖ బృందాలు  సుమారు 30 మంది పులి కదలికలను గమనిస్తున్నారు.

🚨 అత్యవసర హెచ్చరిక 🚨

చాగల్లు మండలం చిక్కాల గ్రామ సరిహద్దు నుంచి నిడదవోలు మండలం తాడిమళ్ల మరియు కోరుమామిడి గ్రామాల సరిహద్దు ప్రాంతాల్లో 
  😸  పెద్దపులి 😸  
సంచరిస్తున్నట్లు ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది.

కావున తాడిమళ్ల మరియు కోరుమామిడి గ్రామాల ప్రజలు అత్యవసర అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకుండా, ముఖ్యంగా రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పశువులను బయటకు వదలకుండా ఇంటి వద్దే సురక్షితంగా ఉంచాలి. పిల్లలు, వృద్ధులు ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

పెద్దపులి సంచారం గురించి ఏదైనా సమాచారం/ఆచూకీ లభించినట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించగలరు.



తహసీల్దార్,
నిడదవోలు మండలం.

కాల్దరి ఈర్పిన సత్యనారాయణ గారి కోళ్ళ ఫామ్స్ ఎదురుగా ఉన్న పుంత లోకి దయచేసి ఎవ్వరు రావద్దు ఆ పుంతలోనే పెద్ద పులి సంచారం ఉన్నట్టు గుర్తించారు. దయచేసి అటు వైపు గా రైతులు కానీ ప్రజలు రావొద్దని పోలీస్ వారి హెచ్చరిక.

Also read

Related posts